YCP MLAs: ‘ఆ నలుగురు ఎమ్మెల్యేల’పై సస్పెన్షన్ వేటు.. వెల్లడించిన సజ్జల

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ వైసీపీ ఎమ్మెల్యేలపై అధిష్టానం వేటు వేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

YCP MLAs:  ‘ఆ నలుగురు ఎమ్మెల్యేల’పై సస్పెన్షన్ వేటు.. వెల్లడించిన సజ్జల

YCP MLAs: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సజ్జలు చెప్పారు.

Rains In Telangana: శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

గురువారం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఈ అంశంపై వైసీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై పరిశీలన జరిపిన పార్టీ అధిష్టానం క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ నలుగురు ఎమ్మెల్యేల్ని గుర్తించింది. దీంతో వారిపై చర్యలకు దిగింది. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సజ్జల మీడియాతో మాట్లాడుతూ నలుగురు ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ నలుగురు ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేశాం. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీధేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ చేసినట్లు ఆధారాలతోసహా నిరూపితమైంది.

Viral Video: ప్రేక్షకులకు షాకిస్తున్న సీరియల్స్.. ఈ సీన్ చూస్తే హడలే… ఏకంగా తాడుతో చంద్రుడ్నే కిందకు లాగారు..!

ఎన్నికల్లో పార్టీ గెలవడం ముఖ్యం కనుక ఈ నిర్ణయం తీసుకున్నాం. మిగతా వాళ్లెవరూ పార్టీ గీత దాటలేదు. సీటు లేకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ఉండవచ్చు. ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు చంద్రబాబు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఇచ్చి ప్రలోభపెట్టినట్లు తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్లకు టిక్కెట్ ఇస్తామని కూడా ఆశ చూపి ఉండొచ్చు. చంద్రబాబుకు ఇది అలవాటే. గతంలో 23 మంది ఎమ్మెల్యేల్ని చంద్రబాబు పశువుల్ని కొన్నట్లు కొన్నారు’’ అని సజ్జల వ్యాఖ్యానించారు.