YS Viveka case : ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా దస్తగిరితో పాటు నిందితులందరికి భారీగా డబ్బులు అందాయి : సునీతారెడ్డి

మాజీ మంత్రి వివేకానంద్ రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటీషన్ లో కీలక అంశాలు వెలుగు చూశాయి. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా నిందితులు దస్తగిరితో పాటు మిగిలిన నిందుతులు అందరికి భారీగా డబ్బులు అందాయని..పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసి గుండెపోటుతో చనిపోయారని నమ్మించే యత్నం చేశారని సునీత తన ఇంప్లీడ్ పిటీషన్ లో పేర్కొన్నారు.

YS Viveka case : ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా దస్తగిరితో పాటు నిందితులందరికి భారీగా డబ్బులు అందాయి : సునీతారెడ్డి

YS Viveka case.. implead petition filed by Sunitha Reddy

YS Viveka case : మాజీ మంత్రి వివేకానంద్ రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన ఇంప్లిడ్ పిటీషన్ లో కీలక అంశాలు వెలుగు చూశాయి. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా నిందితులు దస్తగిరితో పాటు మిగిలిన నిందుతులు అందరికి భారీగా డబ్బులు అందాయని.. సునీల్ యాదవ్ గూగుల్ టేకౌట్ లొకేషన్ ఆధారంగా వివేకా హత్యకు ముందు అవినాష్ రెడ్డి ఇంటికి పలుమార్లు సునీల్ యాదవ్ వెళ్లారని..సునీతారెడ్డి పేర్కొన్నారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను కావాలని ఓడించారని..అలాగే 2019 ఎంపీ ఎలక్షన్స్ లో వివేకాకు టికెట్ ఇస్తున్నారనే సమాచారంతో హత్య చేశారని సునీతారెడ్డి ఇంప్లిడ్ పిటీషన్ లో పేర్కొన్నారు.

వివేకాను హత్య చేస్తారని ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్న అవినాశ్ రెడ్డికి ముందే తెలుసని..అన్ని పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని మూడో వ్యక్తి ద్వారా వివేకా మరణించారనే వార్త తెలుసుకోవాలని చూశారని..గుండెపోటుతో వివేకా చనిపోయినట్లుగా పోలీసులకు చెప్పారని సునీతారెడ్డి తన పిటీషన్ లో పేర్కొన్నారు. అంతా పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసిన ఆ తరువాత అది సాధారణ మరణం అని నమ్మించటానికి యత్నించారని సునీతా ఇంప్లిడ్ పిటీషన్ పేర్కొన్నారు.

YS Viveka Case: వివేకా హత్య కేసులో అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వండి.. కోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్

రాజశేఖర్ రెడ్డి తమ్ముడు శివప్రకాష్ రెడ్డి వివేకా మరణ వార్తను అవినాష్ కు సమాచారం ఇచ్చాడని..విషయం తెలుసుకున్న అవినాష్ రెడ్డి కేవలం రెండు నిమిషాల్లోనే గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, తదితరులతో కలిసి వివేక ఇంటికి వెళ్లారని తెలిపారు.
గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి గూగుల్ టెక్ ఔట్ లొకేషన్ అవినాష్ రెడ్డి ఇంట్లో చూపించిందని..వివేకా ఇంటికి వచ్చిన డాక్టర్ శశికళకి గుండె పోటుతో చనిపోయినట్లు అవినాష్ చెప్పాడని పేర్కొన్నారు సునీత.

వివేకా గుండె పోటుతో పాటు, రక్తపు వాంతులతో చనిపోయారని అవినాశ్ రెడ్డి పోలీసులకు చెప్పాడని..అది హత్య కాదు , సాధారణ మరణం అని చిత్రకరించే ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు పిటీషన్ లో. గంగాధర్ ఇచ్చిన 161 స్టేట్మెంట్ లో కీలక అంశం బయట పడిందని..వివేకాను తానే హత్య చేసినట్లు ఒప్పుకుంటే 10 కోట్లు ఇస్తానని అవినాష్ రెడ్డి ఆశచూపాడని గంగాధర్ స్టేట్మెంట్ ఇచ్చాడని ఇంప్లీడ్ పిటీషన్ లో పేర్కొన్నారు సునీత.

YS Viveka Case : వైఎస్ వివేక హత్య కేసులో అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

మాజీ సీఐ శంకరయ్య స్టేట్మెంట్ :-వివేకా గుండె పోటుతో చనిపోయాడని అవినాష్ రెడ్డే తనకు స్వయంగా ఫోన్ చేసిన చెప్పాడు. విచారణకు సహకరించకుండా అవినాష్ రెడ్డి కోర్టులలో తప్పుడు కేసులు వేస్తున్నాడు. నాపై, నా కుటుంబంపై అవినాష్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నాడు. పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్న అధికారులపై కూడా అవినాష్ ఆరోపణలు చేస్తున్నాడు. ఏపీ అధికారులు వారి పలుకుబడి ఉపయోగించి అవినాష్ ను కాపాడాలని చూస్తున్నారు.

ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేసిన సందర్బంగా సునీతారెడ్డి మాట్లాడుతూ..మాజీ సీఐ శంకరయ్య, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంవీ కృష్ణ రెడ్డి, గంగాధర్ రెడ్డి లతో తప్పుడు ఆరోపణలు చేస్తూ సీబీఐ అధికారులపైనే ఆరోపణలు చేయిస్తున్నారని..అవినాష్ విచారణ సందర్భంగా ఆడియో , వీడియో అవసరం లేదు నామీద నా కుటుంబం మీద ఆరోపణలు చేశారు కాబట్టే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశానని సునీతారెడ్డి స్పష్టంచేశారు.