YS Viveka Case: వివేకా హత్య కేసులో అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వండి.. కోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్

సీబీఐ అధికారులు తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని కోర్టును కోరారు. వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా అవినాష్ శుక్రవారం ఉదయం సీబీఐ ఎదుట హాజరయ్యారు.

YS Viveka Case: వివేకా హత్య కేసులో అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వండి.. కోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్

YS Viveka Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ తనను అరెస్టు చేయకుండా చూడాలని కోరుతూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు. కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు కాబట్టి, సీబీఐ అధికారులు తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని కోర్టును కోరారు.

Germany Shooting: జర్మనీలోని హ్యాంబర్గ్‌ చర్చిలో కాల్పులు.. పలువురి మృతి

వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా అవినాష్ శుక్రవారం ఉదయం సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఆయన విచారణకు హాజరుకావడం ఇది మూడోసారి. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. కాగా, తన విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు తన వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశించాలని కూడా అవినాష్ రెడ్డి కోర్టును కోరారు. తన న్యాయవాది సమక్షంలోనే విచారించేందుకు అంగీకరించాలని గతంలో కోరినప్పటికీ, సీబీఐ దీనికి అంగీకరించలేదన్నారు.

West Bengal Strike: సమ్మెకు హాజరైతే షోకాజ్ నోటీసు ఇస్తాం.. ఉద్యోగులకు బెంగాల్ ప్రభుత్వం హెచ్చరిక

వైఎస్ వివేకా హత్య కేసులో ఏ4గా ఉన్న దస్తగిరిని సీబీఐ ఇప్పటివరకు అరెస్టు చేయలేదని, అతడి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించలేదని అవినాష్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తన విషయంలో సీబీఐ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా ఈ హత్యలో తన ప్రమేయం ఉందని చెప్పేందుకు ఎలాంటి ఆధారం లేదని ఆయన కోర్టుకు తెలిపారు.