YS Viveka murder case: వివేకాకేసులో కీల‌క మ‌లుపు.. సీబీఐ అదుపులో నలుగురు

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు కడపలో దూకుడు పెంచారు. ఇప్పటికే మాజీ డ్రైవర్ దస్తగిరిని, దస్తగిరితో పాటు వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను విచారించిన సీబీఐ అధికారులు.

YS Viveka murder case: వివేకాకేసులో కీల‌క మ‌లుపు.. సీబీఐ అదుపులో నలుగురు

Vivek

YS Viveka murder case: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు కడపలో దూకుడు పెంచారు. ఇప్పటికే మాజీ డ్రైవర్ దస్తగిరిని, దస్తగిరితో పాటు వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాను విచారించిన సీబీఐ అధికారులు.. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు నలుగురు చుట్టే తిరుగుతూ ఉండగా.. వారిని క్షుణ్ణంగా విచారిస్తున్నారు అధికారులు.

ఈ క్రమంలోనే కీలక మలుపు తీసుకుంది వివేకా హత్యకేసు. లేటెస్ట్‌గా ఎర్రగంగిరెడ్డి, డ్రైవర్ ప్రసాద్, మాజీ డ్రైవర్ దస్తగిరితో పాటు వివేకా కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాలను అదుపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు. నలుగురు స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసిన పోలీసులు.. నలుగురిని కడపకు తరలించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే నలుగురికి నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించిన అధికారులు..

గతంలో ఇదే కేసులో హత్యతో ప్రవేయం ఉందని అనుమానిస్తూ.. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైనవారిలో వివేక వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, ప్రధాన అనుచరుడైన ఎర్రగంగిరెడ్డి, ఇంట్లో పనిచేసే లక్ష్మీ కుమారుడు ప్రకాశ్‌ ఉన్నారు. సాక్ష్యాలు తారుమారు చేశారంటూ గతంలో అరెస్ట్‌లు చేయగా.. తర్వాత బెయిల్‌పై వారు బయటకు వచ్చారు. వివేకా కుమార్తె సునీత ఢిల్లీకి వెళ్లొచ్చాక కేసు విచారణలో కాస్త దూకుడు పెంచారు సీబీఐ అధికారులు.