Dastagiri : అవినాశ్ రెడ్డి, సీఎం జగన్ వల్ల నాకు ప్రాణ హాని : వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి

వైఎస్ అవినాశ్ రెడ్డి పాత్ర వందకు వెయ్యి శాతం ఉంది కాబట్టే సీబీఐ ఆయన వైపుగా విచారణ కొనసాగిస్తోందని చెప్పారు. సీబీఐపై అన్యాయంగా, అక్రమంగా మాట్లాడుతున్నారని తెలిపారు.

Dastagiri : అవినాశ్ రెడ్డి, సీఎం జగన్ వల్ల నాకు ప్రాణ హాని : వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి

Dastagiri

Dastagiri : కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, సీఎం జగన్ పై వైఎస్ వివేకానంద రెడ్డి మాజీ డ్రైవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఎంపీ అవినాశ్ రెడ్డి, సీఎం జగన్ వల్ల ప్రాణ హాని ఉందని దస్తగిరి ఆరోపించారు. తాను సునీతమ్మ దగ్గర గానీ, సీబీఐ దగ్గర గానీ 10 వేల రూపాయలు తీసుకున్నానని నిరూపిస్తే జైలు కెళ్లడానికి సిద్ధమన్నారు. అలా నిరూపించలేక పోతే మీరు పార్టీ పదవులకు రాజీనామా చేసి జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ దస్తగిరి సవాల్ చేశారు.

వైఎస్ అవినాశ్ రెడ్డి పాత్ర వందకు వెయ్యి శాతం ఉంది కాబట్టే సీబీఐ ఆయన వైపుగా విచారణ కొనసాగిస్తోందని చెప్పారు. సీబీఐపై అన్యాయంగా, అక్రమంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఇప్పుడు సమస్య తమ వరకు వచ్చింది కాబట్టి అరెస్టు చేస్తారనే భయంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. సీబీఐ విచారణ చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 300 మందిని విచారణ చేశారని వెల్లడించారు. తాను తప్పు చేశాను కాబట్టే అప్రూవల్ గా మారానని తెలిపారు.

YS viveka case : ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌లో కీలక అంశాలు.. వివేకా,సునీతారెడ్డిపై తీవ్ర ఆరోపణలు

మరోవైపు వైఎస్ అవినాశ్ రెడ్డి పిటిషన్ ను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఉదయం అవినాశ్ పిటిషన్ పై మరోసారి విచారణ జరుగనుంది. మధ్యాహ్నం లోపు అవినాశ్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. అవినాశ్ రెడ్డిని మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారించాలని సీబీఐని హైకోర్టు ఆదేశింది. సునీత రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. మంగళవారం ఉదయం పిటిషన్ పై విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.