YSRCP Plenary : వైఎస్సార్ సీపీ ప్లీనరీలో మొదటి రోజు షెడ్యూల్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని   ఇవాళ ,రేపు ( జులై 8,9 తేదీలలో)  వైఎస్సార్  సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

YSRCP Plenary : వైఎస్సార్ సీపీ ప్లీనరీలో మొదటి రోజు షెడ్యూల్

Ysrcp Plenary

YSRCP Plenary : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని   ఇవాళ ,రేపు ( జులై 8,9 తేదీలలో)  వైఎస్సార్  సీపీ   ప్లీనరీ నిర్వహిస్తోంది.  అందుకు  అన్ని ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా 2017 జూలై 8 – 9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీని నిర్వహిస్తోంది. ప్లీనరీ ప్రాంగణానికి మహానేత వైఎస్సార్‌ ప్రాంగణంగా నామకరణం చేశారు.
ఈరోజు రేపు ప్లీనరీలో జరిగే కార్యక్రమాలను పార్టీ విడుదల చేసింది.

మొదటిరోజు షెడ్యూల్…
ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు పార్టీ ప్రతినిధుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం…
ఉదయం 10 గంటల నుంచి 10.10 గంటల వరకూ వరకు కేంద్ర నిర్వహణ మండలి సభ్యులు సమావేశం…
10.00 నిమిషాల నుంచి 10.15 నిమిషాల వరకు పార్టీ అధ్యక్షులు సీఎం జగన్ పార్టీ జెండా ఆవిష్కరణ…
10.15 నిమిషాల నుంచి 10.20 నిమిషాల వరకు ప్రార్ధన..

10.20 నిమిషాల నుంచి 10.30 నిమిషాల వరకు వేదిక పైకి పార్టీ అధ్యక్షులను ఇతర ప్రధాన నాయకులను ఆహ్వాన కార్యక్రమం..
10. 30 నిమిషాల నుండి 10:35 వరకు వందేమాతర గీతం..
10:35 నుండి 10:45 నిమిషాల వరకు వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు నివాళి కార్యక్రమం..
10.45 నిమిషాల నుంచి 10.55 వరకూ సర్వ మత ప్రార్థనలు..

10.55 నుండి 11 గంటల వరకు పార్టీ అధ్యక్షులు ఎన్నికల ప్రకటన విడుదల చేయనున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు..
11.00 గంటల నుండి 11.10 నిమిషాల వరకు సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం..
11.10 నుంచి 11.15 నిమిషాల వరకు పార్టీ జమా ఖర్చులు ఆడిట్ స్టేట్మెంట్ ప్రతిపాదన చేయనున్న టి కృష్ణమోహన్ రెడ్డి..

11.15 నుండి 11. 20 నిమిషాల వరకు పార్టీ నియమావళి సవరణలు ప్రతిపాదనకు ఆమోదం..
11. 20 నిమిషాల నుండి 11:35 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు..
11:35 నుండి 11:45 నిమిషాల వరకు పార్టీ కార్యక్రమాలను నివేదిక వివరించనున్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి..

11:45 నిమిషాల నుండి 1గంట వరకూ మహిళా సాధికారత దిశా చట్టం పై ప్రసంగించనున్న మహిళా నేతలు మంత్రి ఉషశ్రీ చరన్ మంత్రి ఆర్కే రోజా ఎమ్మెల్సీ పోతుల సునీత, నందమూరి లక్ష్మీపార్వతి జక్కంపూడి విజయలక్ష్మి..
మధ్యాహ్నం ఒంటిగంట నుండి 2.15 నిమిషాల వరకు విద్యారంగంపై మాట్లాడను బస్సు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, టీజేఆర్ సుధాకర్ బాబు, కిలారు రోశయ్య, నాగార్జున యాదవ్
2.30 నుండి 3.15 వరకూ నవరత్నాలు పై చర్చ.. నవరత్నాలు డివిడి పై మాట్లాడనున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి..

3.15 నుండి 4.15 వరకూ వైద్యం పై చర్చ.. వైద్య రంగంలో సంస్కరణలపై మాట్లాడను అన్న మంత్రి విడుదల రజిని మంత్రి అప్పలరాజు మాజీ మంత్రులు అనిల్ కుమార్ ఆళ్ల నాని..
4.30 నుండి 5.30 వరకూ పరిపాలన పారదర్శకత తీర్మానం పై మాట్లాడనున్న తమ్మినేని సీతారాం ధర్మాన ప్రసాదరావు గొలుసు పార్థసారథి పాముల పుష్ప శ్రీవాణి ప్రసంగం అనంతరం వందన సమర్పణ చేస్తారు.

Also Read :YSRCP Plenary : వైసీపీ ప్లీనరీకీ భారీ ఏర్పాట్లు.. 9 తీర్మానాలపై చర్చ

అటు.. ప్లనరీలో పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ను ఎన్నుకునేందుకు వైసీపీ లీడర్లు సిద్ధమవుతున్నారు.  ఈరోజు జరిగే  సమావేశంలో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిని పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకుంటామని ప్రకటించారు ఎంపీ విజయసాయిరెడ్డి. ప్లీనరీ మొదటి రోజే దీనిపై తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదిస్తామని తెలిపారు విజయసాయిరెడ్డి. ఇందుకు కార్యకర్తలంతా ఆమోదం తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి.

ప్లీనరీ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పారు టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత జరుగుతున్నందున భారీ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దాదాపు 4 లక్షల మంది హాజరయ్యేలా చర్యలు చేపట్టామని.. ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తాలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలుస్తామని.. మళ్లీ జగనే సీఎం అని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి. కాగా.. ప్లీనరీ  సమావేశాల్లో ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా పాల్గొంటున్నారు. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న ఆమె.. రెండో రోజు ప్లీనరీలో ప్రసంగిస్తారని చెబుతున్నారు వైసీపీ నేతలు.