YSRCP Plenary : వైసీపీ ప్లీనరీకీ భారీ ఏర్పాట్లు.. 9 తీర్మానాలపై చర్చ

ఈ నెల 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ జరగనుంది. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో నిర్వహించనున్న ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 4 లక్షల మంది వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు.

YSRCP Plenary : వైసీపీ ప్లీనరీకీ భారీ ఏర్పాట్లు.. 9 తీర్మానాలపై చర్చ

Ysrcp Plenary (1)

YSRCP Plenary : ఈ నెల 8, 9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ జరగనుంది. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ సమీపంలో నిర్వహించనున్న ప్లీనరీకి రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 4 లక్షల మంది వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ ప్లీనరీ ద్వారా మూడేళ్లలో ప్రభుత్వం ఏం చేసింది? రానున్న రెండేళ్లు ఏం చేయబోతుంది? వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధం అవ్వాలి? అనే అంశాలపై చర్చిస్తారు. 9 తీర్మానాలను ప్లీనరీ లో చర్చించి ఆమోదం తెలపనున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

వైసీపీ ప్లీనరీకి వేళ అయ్యింది. ప్లీనరీకి చకచకా ఏర్పాట్లు జరుగతున్నాయి. ప్లీనరీలో చర్చించాల్సిన అంశాలు, తీర్మానాలను పార్టీ పెద్దలు సిద్ధం చేస్తున్నారు. ఈసారి మొత్తం 9 తీర్మానాలను ప్రవేశపెట్టబోతున్నారు. ఇందులో మహిళా సాధికారిక దిశ చట్టం, విద్య వైద్యం, నవరత్నాలపై తీర్మానాలు చేయనున్నారు. అలాగే పరిపాలన పారదర్శకత, సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు, ఎల్లో మీడియా దుష్ట చతుష్టయం తీర్మానాలను ఈ ప్లీనరీలో ఆమోదించనున్నారు.

YSRCP Plenary : జులై 8,9ల్లో వైసీపీ రాష్ట్ర స్ధాయి ప్లీనరీ సమావేశాలు

ఒక్కో నేత ఒక్కో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఒక్కో అంశానికి సంబంధించి చర్చిందేకు ఐదుగురు సభ్యులకు మాట్లాడే అవకాం ఈ ప్లీనరీలో ఇవ్వబోతున్నారు. ఈ లెక్కన 9 తీర్మానాలపై 45మంది సభ్యులు ప్రసంగించే చాన్స్ ఉంది. నవరత్నాల పేరుతో ఇప్పటికే అనేక పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్లీనరీలో 9 తీర్మానాలను ఆమోదించనుంది.

గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే ప్లీనరీని పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాలు మేనిఫెస్టోలో ప్రకటించని ఎన్నో హామీలను ఇప్పటికే అమలు చేశామని చెబుతున్న వైసీపీ నేతలు.. ఈ ప్లీనరీ ద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు. ప్లీనరీలో పాల్గొని ప్రజలకు మరింత మంచి పాలన అందించేందుకు ఏం చేయాలో చర్చిద్దాం రండి అంటూ పార్టీ నేతలకు, కార్యకర్తలకు స్వయంగా జగన్ లేఖ రాశారు. దీంతో భారీగా ఈ ప్లీనరీకి రాబోతున్నారు.

ysrcp: వైసీపీ ప్లీన‌రీలో ప్ర‌సంగించ‌నున్న విజ‌య‌మ్మ‌.. చాలా కాలం త‌ర్వాత పార్టీ కార్యక్ర‌మానికి..