YSRCP Plenary : జులై 8,9ల్లో వైసీపీ రాష్ట్ర స్ధాయి ప్లీనరీ సమావేశాలు
జులై 8,9 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్ధాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు.

Ysrcp Pleenary
YSRCP Plenary : జులై 8,9 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్ధాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. రెండు రోజుల పాటు జరిగే ప్లీనరీ సమావేశాల్లో మహిళా సాధికారిత, విద్య,వైద్యం పై వక్తలు మాట్లాడతారు అని ఆయన తెలిపారు. నియోజకవర్గం, జిల్లాస్దాయిలలో నిర్వహిస్తున్న ప్లీనరీకి మంచి ప్రతి స్పందన వచ్చిందని ఆయన అన్నారు. రెండు రోజుల పాటు సీఎం జగన్ వేదిక మీదే ఉంటారని విజయసాయిరెడ్డి తెలిపారు.
ఎప్పుడెప్పుడు ప్లీనరీకి వెళతామా అని కార్య కర్తలు అంతా ఎదురు చూస్తున్నారని విద్యాశాఖ మంత్రి బొత్ససత్యనారాయణ అన్నారు. ప్లీనరీ ఏర్పాటు చేయటం ఆనందంగా ఉందని అంటూ ఆయన… పార్టీని గ్రామ స్ధాయి నుంచి బలోపేతం చేస్తామని తెలిపారు. మా పార్టీ విధానమే ప్రభుత్వ విధానమని.. వాన దేవుడు కరుణించాలని ఆయన వ్యాఖ్యానించారు. . గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వద్ద రెండు రోజుల పాటు నిర్వహించే ప్లీనరీకి పార్టీ ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించింది.
Also Read : Dhoom-Style Robbery : సినీ ఫక్కీలో చోరీ-చేతనైతే పట్టుకోండని సవాల్