YSRCP Plenary : రెండో రోజు ఐదు తీర్మానాలు-సాయంత్రం భారీ బహిరంగ సభ

గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో రెండవ రోజు శనివారం నాడు ఐదు తీర్మానాలపై చర్చించనున్నారు.

YSRCP Plenary : రెండో రోజు ఐదు తీర్మానాలు-సాయంత్రం భారీ బహిరంగ సభ

Ysrcp Plenary 2nd Day

YSRCP Plenary :  గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జరుగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో రెండవ రోజు శనివారం నాడు ఐదు తీర్మానాలపై చర్చించనున్నారు.

రెండవ రోజు షెడ్యూల్….
ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానున్న ప్లీనరీ
9.30 నుండి 10.15 వరకూ సుపరిపాలన పారదర్శకత తీర్మానం పై చర్చ.. ఈ అంశాలపై తమ్మినేని సీతారాం, కొలుసు పార్థ సారథి, పాముల పుష్ప శ్రీ వాణీ మాట్లాడతారు.
10.15 నుండి 12.15 సామాజిక సాధికారిక తీర్మానంపై మాట్లాడనున్న మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాల్, కారుమూరి నాగేశ్వరరావు, ఆర్ కృష్ణయ్య, జూపూడి ప్రభాకర్, ఆఫీజ్ ఖాన్, నాగులపల్లి ధనలక్ష్మి

12.30 నుండి 1.30 వరకూ వ్యవసాయ రంగంపై ప్రవేశపెట్టనున్న తీర్మానంపై మాట్లాడనున్న కాకాని గోవర్ధన్ రెడ్డి, కన్నబాబు నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, విశ్వేశ్వర రెడ్డి
1.30 నుండి 2.15 వరకూ పరిశ్రమలు ఎం.ఎస్.ఎం ఈ ప్రోత్సాకాలు తీర్మానంపై మాట్లాడనున్న మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు అబ్బయ్య చౌదరి, బొల్ల బ్రహ్మనాయుడు
2.30 నుండి 3.30 వరకూ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం దుష్ట చతుష్టయం తీర్మానం పై మాట్లాడనున్న మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పోసాని కృష్ణ మురళి

3.45 నుండి 4.30 గంటల వరకూ పార్టీ శాశ్వత అధ్యక్షులు ఎంపికను ప్రకటించనున్న ఉమారెడ్డి వెంకటేశ్వర్లు
5.00 గంటలకు సీఎం జగన్ ముగింపు ప్రసంగం. ఈరోజు జరిగే ముగింపు సభకు సుమారు మూడు నుండి నాలుగు లక్షలు మంది ప్రజలు వస్తారని పార్టీ అంచనా వేసింది.

Also Read : Chandrababu : వైసీపీ పాలనలో నవరత్నాలు కాదు.. నవ ఘోరాలు : చంద్రబాబు