Home » Author »naveen
వాహనాల కొనుగోలు కుంభకోణంలో వరుసగా రెండో రోజూ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని.. ఈడీ విచారిస్తోంది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఘటన కేసులో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. సొంత కూతురే ఆస్తి కోసం భర్తతో కలిసి తల్లిని హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. దుండగులు ఇంట్లోకి రావడానికి తలుపులు తీసింది కూడా కూతురేనని విచారణలో తేలింది.
కాకినాడలో దారుణం జరిగింది. ప్రేమించడం లేదని ఓ యువతిని అతి కిరాతకంగా హత్య చేశాడో ప్రేమోన్మాది. కూరాడ గ్రామంలో స్కూటీపై వస్తున్న యవతిని కత్తితో నరికి చంపేశాడు. ప్రేమించాలంటూ ఏడాదిగా యవతి వెంట పడుతున్నాడు.
ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. పలు జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ లు జారీ చేశారని చెప్పారు. మరో 48 గంటల పాటు వానలు పడతాయన్నారు.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో రెండురోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ తెలిపింది.
లక్నో వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ పోరాడి ఓడింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో 9 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి చవిచూసింది. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ వీరోచిత పోరాటం వృథా అయ్యింది.
సీఐడీ పోలీసులు తన ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డారని, తన కుమార్తెను బెదిరించారని, డ్రైవర్ ను కొట్టారని సంచలన ఆరోపణలు చేశారు చింతకాయల విజయ్.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 38వేల 300 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 33వేల 681మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 508కి తగ్గింది.
సీఎం కేసీఆర్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. రాజీనామా చేసి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలవాలన్నారు.
మొదట బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు చేసింది. మిడిలార్డర్ లో హెన్రిచ్ క్లాసెన్ (74 నాటౌట్), డేవిడ్ మిల్లర్ (75 నాటౌట్) దూకుడుగా ఆడారు. హాఫ్ సెంచరీలతో మెరిశారు.
రద్దై, చెలామణిలో లేని రూ.500, రూ.1000 నోట్లు భారీగా పట్టుబడిన ఘటన కలకలం రేపింది. ములుగు జిల్లాలో చెలామణిలో లేని పాత 500, 1000 రూపాయల నోట్లు భారీగా పట్టుబడ్డాయి.
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో పెను ప్రమాదం తప్పింది. నిన్నటి నుంచి విజయవాడలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో అమ్మవారి సన్నిధిలోని రావిచెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి.
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వెంకన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల భక్త జన సంద్రంగా మారింది. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది.
టీడీపీ నేత చింతకాయల విజయ్ సీఐడీ విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఐడీ విచారణకు ఇంతవరకు విజయ్ హాజరుకాలేదు. దీంతో విజయ్ కోసం సీఐడీ అధికారులు ఎదురుచూస్తున్నారు.
తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వానలు పడతాయంది. చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 38వేల 243 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 33వేల 585మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 547కి తగ్గింది.
కొత్త పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఎన్ని పార్టీలు వచ్చినా ఏపీలో మాత్రం వైసీపీదే అధికారం అని వైవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. తమ సంక్షేమ పథకాలే జగన్ ను మళ్లీ సీఎంని చేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇకపై యూపీఐ పేమెంట్లు ఉచితంగా చేసుకోవచ్చు. అంటే ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే, రూ.2వేల వరకు మాత్రమే లావాదేవీలు జరుపుకునే వెసులుబాటు ఉంది. అదీ రూపే క్రెడిట్ కార్డుల మీద మాత్రమే.
మునుగోడు ఉపఎన్నికలో ప్రజాశాంతి పార్టీ తరపున ప్రజాగాయకుడు గద్దర్ పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు.
ఓ మీడియా ప్రతినిధి.. కేసీఆర్ జాతీయ పార్టీపై స్పందించాలని చంద్రబాబుని కోరారు. దీనికి చంద్రబాబు.. ఓ చిరునవ్వు నవ్వి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. చంద్రబాబు రియాక్షన్ చూసి అక్కడున్న వాళ్లంతా కొంత ఆశ్చర్యపోయారు.