Home » Author »kunduru Vinod
6,000 మందితో ప్రయాణిస్తున్న క్రూజ్ షిప్లో కరోనా కేసులు బయటపడటం కలకలం సృష్టించింది. ఓ మహిళ అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు కరోనా పరీక్ష నిర్వహించారు. కరోనా నిర్దారణ అయింది.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ నెల 29న హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయంలో కోవింద్ బస చేయనున్నారు.
దక్షిణ కొరియా వీడియోలు చూశారనే కారణంతో ఏడుగురికి మరణశిక్ష విధించారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.
మద్యం మత్తు ముగ్గురి ప్రాణాలు తీసింది.. మరో వ్యక్తి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. మృతుల్లో ఇద్దరు మూడేళ్ళ చిన్నారులు ఉన్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనుమరాలి రిసెప్షన్ ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాష్ట్రపతి దంపతులతోపాటు, ప్రధాని మోదీ.. పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు
కరోనా మహమ్మారిని 2022 సంవత్సరంలోనే అంతం చేయాలనీ ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ టెడ్రోస్ అధనమ్ ఘోబ్రేసన్ అన్నారు. ఈ మహమ్మారివలన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయన్నారు.
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంపై కేంద్రంతో చర్చించేందుకు తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.. మంత్రుల బృందం నేడు పీయూష్ గోయల్ని కలువనుంది
దేశంలో కరోనా కేసుల సంఖ్య కొద్దిగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది
ఢిల్లీలోని కళావతి ఆసుపత్రిలో నాలుగు నెలల క్రితం ముగ్గురు చిన్నారు మృతి చెందారు. వీరి మృతిపై దర్యాప్తు చేసిన అధికారులు.. దగ్గుమందు వికటించడం వల్లనే మృతి చెందినట్లు తేల్చారు
బ్రిటన్లో ఒమిక్రాన్ బారినపడి 12 మంది మృతి చెందినట్లుగా ఆ దేశ ఉపప్రధాని డొమినిక్ రాబ్ తెలిపారు. ప్రస్తుతం 104 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు
టెస్లా కంపెనీపై కోపంతో ఓ వ్యక్తి కోటి రూపాయల విలువ చేసి కారును పేల్చేశాడు. ఇందుకోసం 30 కేజీల డైనమైట్ స్టిక్స్ వాడాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది
ధాన్యం సహా పంటల కొనుగోళ్లపై ఆహార పౌరసరఫరాల శాఖ, వ్యవసాయశాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
సినిమా టికెట్ల రేట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 35పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.
సీఎం జగన్ మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ జిల్లా నుంచే సంపూర్ణ గృహహక్కు పథకానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 14 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం వెనుకనుంచి ఢీకొంది.. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు.
కోడిపందాలకు ముందుగానే అనుమతి ఇవ్వాలని సీఎం జగన్కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖరాశారు.
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సోమవారం ప్రారంభ ట్రేడ్లో 1,000 పాయింట్లకు పైగా క్షిణించింది. ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో పెట్టుబడి దారులు భయంతో అమ్మకాల బాటపట్ట
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఆదివారం 7,081 కేసులు నమోదు కాగా, సోమవారం 6,563 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది.
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. దేశంలోని 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.
కరోనా ఆంక్షలు మరింత కఠినతరం చేయాలనీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు సెల్వ వినాయగం లేఖ రాశారు.