Corona Update : దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరుగుతున్న ఒమిక్రాన్ బాధితులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఆదివారం 7,081 కేసులు నమోదు కాగా, సోమవారం 6,563 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది.

Corona Cases (5)
Corona Update : దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఆదివారం 7,081 కేసులు నమోదు కాగా, సోమవారం 6,563 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది. ఇక కరోనాతో గడిచిన 24 గంటల్లో 132 మంది మరణించినట్లుగా పేర్కొంది. గత కొంతకాలంగా కరోనా కేసుల కంటే రికవరీ రేటే అధికంగా ఉంటుంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 8,077 మంది ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 82,267 యాక్టివ్ కేసులు ఉన్నట్లు బులిటెన్‌లో పేర్కొన్నారు.
చదవండి : Coronavirus : కరోనా కేసులు, మళ్లీ పెరుగుతున్నాయి..జాగ్రత్త
ఇక ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటివరకు దేశంలో 155 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. అత్యధికంగా మహారాష్ట్రలో ఈ వేరియంట్ బాధితుల సంఖ్య అధికంగా ఉంది. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ 6 రేట్లు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఒమిక్రాన్ కేసులపై ప్రత్యేకంగా దృషి పెట్టారు. ఇక దేశంలో వ్యక్తినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 137.67 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందించారు. దేశంలో చాలా జిల్లాలు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నాయి.
చదవండి : AP Corona : ఏపీలో కరోనాతో ముగ్గురు మృతి, కొత్తగా 148 కేసులు