AP Corona : ఏపీలో కరోనాతో ముగ్గురు మృతి, కొత్తగా 148 కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 33వేల 043 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 148 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా..

AP Corona : ఏపీలో కరోనాతో ముగ్గురు మృతి, కొత్తగా 148 కేసులు

Ap Corona Cases

AP Corona : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 33వేల 043 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 148 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 34 కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కరోనాతో చనిపోయారు. గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

గత 24 గంటల్లో 152 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 20,75,419కి చేరుకుంది. ఇప్పటి వరకు 20,59,131 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 14వేల 474కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,814 యాక్టివ్ కేసులున్నాయి.

Omicron Variant vs Delta: డెల్టా కంటే ఒమిక్రాన్ ప్రమాదమా? రెండు వేరియంట్లలో ఏయే లక్షణాలు ఉన్నాయంటే..?

బుధవారం దేశవ్యాప్తంగా 12,16,011 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 7వేల 974 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ముందురోజు కంటే కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 343 మరణాలు సంభవించాయి. నిన్న 7వేల 948 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం 87వేల 245 యాక్టివ్ కేసులున్నాయి. క్రియాశీల కేసుల రేటు 0.25 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.38 శాతంగా ఉంది. ఇప్పటివరకు 3.47 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా.. వారిలో 3.41 కోట్ల మంది(3,41,54,879) కోలుకున్నారు. 4లక్షల 76వేల 478 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 60 లక్షల మందికి పైగా టీకా వేయించుకోగా.. ఇప్పటివరకు టీకా తీసుకున్న వారి సంఖ్య 135 కోట్ల మార్కును దాటింది.

Exercises : కాళ్లల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగించే వ్యాయామాలు ఇవే…

డెల్టా వేరియంట్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో హమ్మయ్య అని అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇంతలోనే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. డెల్టా కన్నా వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. మన దేశంలోనూ ఒమిక్రాన్ కలవరం రేపుతోంది. క్రమంగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.

దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉండగా.. ఇప్పుడు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ కలవరపెడుతోంది. ఇది క్రమంగా పలు రాష్ట్రాలకు వ్యాపిస్తోంది. తాజాగా 7 వేల మందికి కొవిడ్‌ సోకగా.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 68కి చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 32 మంది కొత్త వేరియంట్‌ బారినపడ్డారు.

ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనని నిపుణులు తేల్చి చెప్పారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మస్ట్ అంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపడుతున్నాయి. దాదాపుగా చాలామంది రెండు డోసులు తీసుకున్నారు. మానవాళికి ముప్పుగా మారిన కరోనావైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే అని నిపుణులు అంటున్నారు.