Omicron Variant vs Delta: డెల్టా కంటే ఒమిక్రాన్ ప్రమాదమా? రెండు వేరియంట్లలో ఏయే లక్షణాలు ఉన్నాయంటే..?

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడుస్తోంది. కరోనా తగ్గిపోయిందిలే అనుకుంటే.. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

Omicron Variant vs Delta: డెల్టా కంటే ఒమిక్రాన్ ప్రమాదమా? రెండు వేరియంట్లలో ఏయే లక్షణాలు ఉన్నాయంటే..?

Omicron Variant Vs Delta How Do They Differ What Are The Symptoms (1)

Omicron Variant vs Delta: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడుస్తోంది. కరోనా తగ్గిపోయిందిలే అనుకుంటే.. ఒమిక్రాన్ రూపంలో మరో కొత్త వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరులా పెరిగిపోతున్నాయి. దక్షిణాఫ్రికాలో కనిపించిన ఈ వేరియంట్.. పలు దేశాల్లో వ్యాపించింది. ఇప్పుడు భారతదేశంలో కూడా ఒమిక్రాన్ ప్రవేశించింది. బ్రిటన్‌లో ఒమిక్రాన్‌తో తొలి మరణం నమోదైన నేపథ్యంలో.. మహమ్మారి మళ్లీ విజృంభిస్తే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై భారత్ సహా పలు దేశాల ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఒమిక్రాన్ వేరియంట్ విషయంలోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనకరమైన వేరియంట్‌గా గుర్తించింది. భారతదేశంలోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

డెల్టా వేరియంట్‌ కన్నా అత్యంత వేగంగా ఒమిక్రాన్‌ వ్యాపిస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ తీవ్రత, లక్షణాలు తీవ్రంగా ఉంటాయా లేదా అనేది స్పష్టంగా తెలియదు. కొంతమంది వైద్య నిపుణులు మాత్రం ఒమిక్రాన్‌ డెల్టా వేరియంట్‌ కంటే అంత ప్రమాదకరమైంది కాదని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఒమిక్రాన్ ఎలా మ్యుటేట్ అవుతుందో చెప్పడం కష్టమని చెబుతున్నారు. అందుకు ముందుగానే సరైన జాగ్రత్తలు పాటిస్తే ఒమిక్రాన్ బారినుంచి సురక్షితంగా బయటపడవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ ప్రమాదకరమైనదా? రెండు వేరియంట్‌ ఒకదానికొకటి ఎలా భిన్నంగా ఉన్నాయి.. వాటి లక్షణాలు తీవ్రత ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏయే వేరియంట్లను మొదట ఎక్కడ గుర్తించారంటే? :
నవంబర్ 2021లో దక్షిణాఫ్రికాలోని బోట్స్వానాలో ఒమిక్రాన్ మొదటి కేసు నమోదైంది. మరోవైపు.. డెల్టా వేరియంట్ మొదటిసారిగా డిసెంబర్ 2020లో భారతదేశంలో కనిపించినట్టు పలు నివేదికలు తెలిపాయి.

ఏ వేరియంట్ ఎలా వ్యాపించిందంటే?
బోట్స్‌వానాలో గుర్తించిన మూడు రోజుల్లోనే.. ఆఫ్రికా ఖండంలో COVID-19 కేసులలో ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర స్థాయిలో వ్యాపించింది. కేవలం నెలలోనే ఈ వేరియంట్ ఇప్పుడు 77 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. చాలా దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించాయి. భారతదేశంలో థర్డ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్.. ప్రపంచ దేశాలను సైతం వణికించింది. ప్రస్తుతం భారత్‌లో మొత్తం COVID-19 కేసులలో 99 శాతంగా ఈ కేసులే ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.

రెండు మ్యుటేషన్లు ఎంతవరకు వ్యాప్తి చెందవచ్చు?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ (Tedros Adhanom Ghebreyesus) చెప్పిన దాని ప్రకారం.. ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 77 దేశాలలో గుర్తించారు. గుర్తించని చాలా దేశాల్లో ఈ వేరియంట్ వ్యాపించే ఉంటుందని భావిస్తోంది. గతంలో మునుపెన్నుడూ చూడని రీతిలో ఒమిక్రాన్ వేరియంట్‌ వ్యాప్తిచెందే ముప్పు ఉందని ఆయన హెచ్చరించారు.

ఒమిక్రాన్ వేరియంట్.. తీవ్రత తక్కువ ఉన్నప్పటికీ కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తే మళ్లీ ఆరోగ్య సంస్థలు తీవ్రఇబ్బందకర పరిస్థితులకు చేరుతాయని WHO చీఫ్ టెడ్రోస్ అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభ సమయంలో వ్యాక్సిన్‌లు మాత్రమే ఏ దేశాన్ని ముప్పు నుంచి బయటపడేయలేవని చెప్పారు. Bloomberg ప్రకారం.. ఒమిక్రోన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కన్నా 4.2 రెట్లు ఎక్కువగా వ్యాపిస్తుందని వెల్లడించింది.

లక్షణాలు ఎంత భిన్నంగా ఉంటాయంటే?
డెల్టా వేరియంట్‌తో పోల్చితే.. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఇప్పటివరకు తేలికపాటివిగా గుర్తించారు. వాసన, రుచి కోల్పోవడం అనేది కామన్ లక్షణంగా గుర్తించారు. ఇప్పటివరకు COVID-19 వైరస్‌లో (డెల్టా) తేలికిపాటి నుంచి తీవ్రమైన లక్షణాలు కనిపించేవి. కానీ, ఒమిక్రాన్ విషయంలో అలా కాదు. ఒమిక్రాన్ వేరియంట్ ఒక విచిత్రమైన లక్షణం కలిగి ఉంది. రాత్రిపూట ఎక్కువగా చెమటలు పట్టడం వంటిది ఎక్కువగా కనిపిస్తోంది. Omicron సోకిన బాధితుల్లో అధిక చెమట పడుతుందని గుర్తించారు. అంతేకాదు.. బాధితుల బట్టలు, పడకలు కూడా తడిసిపోయేంతగా ఉంటున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ కొత్త వేరియంట్‌ బారినపడిన బాధితుల్లో గొంతునొప్పికి బదులుగా దురద లేదా గరుకుగా ఉన్నట్లు నివేదించారు.

డెల్టాతో పోలిస్తే.. ఒమిక్రాన్ ఎంత తీవ్రంగా ఎంతంటే?
ప్రస్తుతం.. Omicron తీవ్రతపై తగినంత డేటా అందుబాటులో లేదు. ఒమిక్రాన్ తీవత్రపై ధృవీకరించిన ఎలాంటి నివేదికలు లేవు. అయినప్పటికీ.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య, వ్యాప్తిని బట్టి.. ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా లక్షణరహితంగా లేదా తేలికపాటి లక్షణాలను కలిగి ఉన్నాయని ఓ నివేదిక వెల్లడించింది. ప్రతిఒక్కరూ ఒమిక్రాన్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌లో డెల్టా వేరియంట్ మొదటిసారిగా గుర్తించిన మూడు నెలల తర్వాత.. దేశంలో రోజుకు కనీసం 4వేల మరణాలు నమోదైనట్టు డేటా వెల్లడించింది.

వేరియంట్లపై COVID-19 వ్యాక్సిన్‌లు ఎంత ప్రభావంతమంటే? :
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇతర వ్యాక్సిన్‌లతో పాటు Pfizer, Moderna, AstraZeneca, Johnson & Johnson వ్యాక్సిన్‌లు డెల్టా వేరియంట్ నుంచి రోగనిరోధక శక్తిని అందించగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ఇన్ఫెక్షన్లను పరిశీలిస్తే.. వ్యాక్సిన్ సామర్థ్యాన్ని తగ్గించే అవకాశం ఉందని WHO తెలిపింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎంతవరకు సమర్థవంతంగా ఎదుర్కోగలవో గుర్తించేందుకు శాస్త్రవేత్తలు అధ్యయనాలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.

Read Also : Vaccine : ఈసారి టార్గెట్ కరోనా కొమ్ముకాదు..పునరుత్పత్తిపైనే..వేరియంట్‌ ఏదైనా వ్యాక్సిన్‌ ఒక్కటే..: UCLA