Vaccine : ఈసారి టార్గెట్ కరోనా కొమ్ముకాదు..పునరుత్పత్తిపైనే..వేరియంట్‌ ఏదైనా వ్యాక్సిన్‌ ఒక్కటే..: UCLA

ఈసారి శాస్త్రవేత్తల టార్గెట్ కరోనా కొమ్ముకాదు..వైరస్ పునరుత్పత్తిపైనే పెట్టారు. కొత్తగా పుట్టుకొచ్చే వేరియంట్లపై కూడా పనిచేసేలా..వేరియంట్ ఏదైనా వ్యాక్సిన్‌ ఒక్కటేలా పరిశోధకులు కృషి

Vaccine : ఈసారి టార్గెట్ కరోనా కొమ్ముకాదు..పునరుత్పత్తిపైనే..వేరియంట్‌ ఏదైనా వ్యాక్సిన్‌ ఒక్కటే..: UCLA

Ucla Study..covid New Vaccine.. (1)

UCLA study..COVID new vaccine : ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న తరుణంలో మహమ్మారిని నియంత్రించటానికి ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు తీవ్ర కృషి చేసి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ కరోనా కొత్త కొత్త వేరియంట్లతో చుక్కలు చూపిస్తోంది. డెల్టా వేరియంటు అంటూ భయపెట్టింది. ప్రస్తుతం ఒమిక్రాన్ గా హడలెత్తిస్తోంది. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్-19 వ్యాక్సిన్లు ఈ వేరియంట్లపై ప్రభావం చూపిస్తాయా? లేదా కొత్త వ్యాక్సిన్ తయారు చేయాలా? అలా కొత్త వేక్సిన్ అవసరమే అనుకుంటే అటువంటి వ్యాక్సిన్ ను శాస్త్రవేత్తలు ఎప్పుడు తయారు చేస్తారు? అది ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఈలోపు కరోనా కొత్త కొత్త రకాల్లో వేరియంట్లుగా మారితే పరిస్థితి ఏంటీ? అనే ఎన్నో సందేహాలు. భయాలు నెలకొన్నాయి.

Read more : vaccine రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నా..ఇంట్లోనే ఉండమంటే ఎలా ?: హైకోర్టు

ఈక్రమంలో ప్రస్తుతమున్న కొవిడ్‌ వ్యాక్సిన్లు కొత్తగా పుట్టుకొచ్చే వేరియంట్లపై ఎందుకంత సమర్థంగా పనిచేయవు? ఏ వేరియంట్‌ కరోనా వైరస్‌నైనా ఒకే వ్యాక్సిన్ తో ఖతం చేయలేమా? నియంత్రించలేమా? కరోనాను అణచివేసే టీకాను ఎందుకు తయారు చేయకూడదు? వంటి ఎన్నో ప్రశ్నలకు తమ పరిశోధనతో బదులిచ్చారు యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెలెస్‌ (యూసీఎల్‌యే) శాస్త్రవేత్తలు..!

ఈసారి శాస్త్రవేత్తల టార్గెట్ కరోనా వైరస్‌పై ఉండే కొమ్ముపై కాకుండా..కరోనా వైరస్‌ పునరుత్పత్తికి కారణమయ్యే వైరల్‌ పాలిమరేస్‌ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుని టీకా తయారుచేసే కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు UCLA శాస్త్రవేత్తలు..! . ‘‘ఇప్పుడున్న కొవిడ్‌ టీకాలు కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ భాగాలతో తయారైనవి. దీంతో అవి వైరస్‌ను గుర్తించి, రోగనిరోధక స్పందన కలుగజేయడానికి దోహదపడతాయి. కానీ..కాలక్రమంలో వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో మార్పులు సంతరించుకుని డెల్టా, ఒమిక్రాన్‌ వేరియంట్లు పుట్టుకొచ్చాయి.

Read more : covaxin vs covishield : కొవాగ్జిన్ రెండు డోసులూ వేయించుకుని..కొవిషీల్డ్ టీకా వేయాలంటూ కోర్టుకెళ్లిన వ్యక్తి

దీంతో ఇప్పుడున్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లను సమర్థంగా గుర్తించలేకపోతున్నాయి. వాటిని కట్టడి చేయలేకపోతున్నాయి. అందుకే..టీకా రెండు డోసులు తీసుకున్నవారు కూడా కొవిడ్‌కు గురవుతున్నారు. కానీ దీనికి చెక్ పెట్టటానికి శాస్త్రవేత్తలు కృషి చేశారు. దీనిపై ఈ  కొత్త అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు మాట్లాడుతు..‘‘ కొవిడ్, సార్స్, మెస్, సాధారణ జలుబుకు కారణమయ్యే అన్నిరకాల కరోనా వైరస్‌లలో అత్యంత సాధారణంగా కనిపించే ‘వైరల్‌ పాలిమరేస్‌’ను రోగనిరోధక వ్యవస్థలో ఉండే T -కణాలతో మిళితం చేశాం. ఈ పాలిమరేస్‌.. స్పైక్‌ ప్రొటీన్‌ మాదిరి మార్పు చెందదు. కాబట్టి కొత్త విధానం ద్వారా అన్ని వేరియంట్లకు వ్యతిరేకంగా దీర్ఘకాల రక్షణ కల్పించే కొత్తతరహా టీకాలను తయారు చేయవచ్చు అని అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.