Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కూలీలు మృతి

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 14 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం వెనుకనుంచి ఢీకొంది.. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు.

Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కూలీలు మృతి

Guntur Accident

Updated On : December 20, 2021 / 1:01 PM IST

Guntur Accident : గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన యడ్లపాడు 16వ నెంబర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పత్తితీతకు వెళ్తున్న కూలీల ఆటోను వెనుకనుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ఆటో అదుపుతప్పి డివైడర్ ఢీకొంది.

చదవండి : Mulugu Accident : రక్తమోడిన రహదారి.. ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఈ ప్రమాదంలో షేక్ దరియాబి (55), బేగం (52) దుర్మరణం చెందగా.. ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో మీనాక్షి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. వీరంతా చిలకలూరిపేట పట్టణంలోని మద్దినగర్, వడ్డెర కాలనీగా మహిళా కూలీలు. పత్తిపాడు మండలం తుమ్మలపాలెంలో పత్తితీత పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

చదవండి : Road Accident : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి