Mulugu Accident : రక్తమోడిన రహదారి.. ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Mulugu Accident : రక్తమోడిన రహదారి.. ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Mulugu Accident

Updated On : December 19, 2021 / 12:46 PM IST

Mulugu Accident : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆదివారం తెల్లవారు జామున కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు బయలుదేరారు. ఈ క్రమంలోనే ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని గంపలగూడెం మార్కెట్ గోడౌన్స్ వద్ద తెల్లవారుజామున కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది.

చదవండి : Encounter In Mulugu District : తెలంగాణలో ఎన్‌కౌంటర్- ముగ్గురు మావోయిస్టులు మృతి

ఈ ప్రమాదంలో ప్రశాంత్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. నిద్రమత్తులో ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో కరువేగం 100కు పైనే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

చదవండి : Tiger tension: ములుగుజిల్లాలో పెద్దపులి కలకలం