Kalavathi Hospital Delhi : దగ్గుమందు వికటించి ముగ్గురు చిన్నారులు మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..

ఢిల్లీలోని కళావతి ఆసుపత్రిలో నాలుగు నెలల క్రితం ముగ్గురు చిన్నారు మృతి చెందారు. వీరి మృతిపై దర్యాప్తు చేసిన అధికారులు.. దగ్గుమందు వికటించడం వల్లనే మృతి చెందినట్లు తేల్చారు

Kalavathi Hospital Delhi : దగ్గుమందు వికటించి ముగ్గురు చిన్నారులు మృతి.. ఆలస్యంగా వెలుగులోకి..

Kalavathi Hospital Delhi

Updated On : December 20, 2021 / 5:58 PM IST

Kalavathi Hospital Delhi : నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని కళావతి ఆసుపత్రిలో 16 మంది చిన్నారు అశ్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఇక దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ విచారణ చేపట్టింది. ఈ కమిటీ తమ రిపోర్టును సోమవారం వెల్లడించింది. దగ్గు సిరప్ వికటించడం వల్లనే చిన్నారులు అశ్వస్థతకు గురైనట్లు తమ దర్యాప్తులో తేలిందని వివరించారు అధికారులు. ప్రభుత్వం సిఫారసు చేసిన డెక్స్‌ట్రోమెథార్ఫాన్ కాఫ్ సిరప్‌ను చిన్నారులకు ఇవ్వడం వల్ల వారు అశ్వస్థతకు గురైనట్లు పేర్కొన్నారు.

చదవండి : Omicron In Delhi : ఢిల్లీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు..దేశవ్యాప్తంగా ఎన్నంటే..

ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌తో పాటు పలు డిస్పెన్సరీల్లో చిన్నారులకు ప్రభుత్వం అందిస్తోన్న డెక్స్‌ట్రోమెథార్ఫాన్ కాఫ్ సిరప్ ఈ చిన్నారుల మృతికి కారణమని డీజీహెచ్ఎస్ పేర్కొంది. ఈ మందును వెంటనే వెనక్కి తీసుకోవాలి అని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇది నాలుగేళ్లు పైబడిన చిన్నారులకు ఇవ్వాలని తెలిపింది వైద్య బృందం

చదవండి : Omicron In Delhi : ఢిల్లీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు

three child diedm,   taking cough syrup,  delhi kalavathi hospital, doctors investigation,