Omicron In Delhi : ఢిల్లీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు

దేశ రాజధానిలో మంగళవారం మరో నాలుగు కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"​ కేసులు వెలుగుచూశాయి. తో ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. వీరందరూ విదేశాల

Omicron In Delhi :  ఢిల్లీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు

Delhi

Omicron In Delhi : దేశ రాజధానిలో మంగళవారం మరో నాలుగు కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”​ కేసులు వెలుగుచూశాయి. తో ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. వీరందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్​ తెలిపారు. ఆరుగురిలో ఒకరు కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారని సత్యేంద్ర జైన్​ తెలిపారు.

ప్రస్తుతం మిగిలిన వారిని లోక్​నాయక్​ జైప్రకాశ్​ నారాయణ్​ హాస్పిటల్ కు తరలించామని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ఢిల్లీ ఆరోగ్యమంత్రి తెలిపారు. ఒమిక్రాన్​ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, పరిస్థితులు ప్రస్తుతం నియంత్రణలోనే ఉన్నాయని స్పష్టం చేశారు.

ఇక, ఇప్పటివరకు 74మందిని ఎయిర్​పోర్టు నుంచి హాస్పిటల్ కు తరలించామని, అక్కడి స్పెషన్​ వార్డుల్లో ఒమిక్రాన్​ అనుమానితులకు చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఢిల్లీలో తాజాగా నమోదైన ఒమిక్రాన్​ కేసులతో.. దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్​ బారినపడిన వారి సంఖ్య 45కు చేరింది.

ALSO READ Sadhvi Saraswati : హిందువులంతా కత్తులు చేతబట్టాలి..సాధ్వి వివాదాస్పద వ్యాఖ్యలు