అదృశ్యమైన 43ఏళ్ల నాటి వయోజర్-2 స్పేస్ క్రాఫ్ట్‌ నుంచి నాసాకు సిగ్నల్..!

  • Published By: sreehari ,Published On : November 4, 2020 / 11:31 AM IST
అదృశ్యమైన 43ఏళ్ల నాటి వయోజర్-2 స్పేస్ క్రాఫ్ట్‌ నుంచి నాసాకు సిగ్నల్..!

NASA – Voyager 2 : ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతో కాంటాక్ట్ కోల్పోయిన 43ఏళ్ల నాటి వయోజర్-2 అంతరిక్ష నౌక నుంచి ఇప్పుడు సిగ్నల్ వచ్చింది. భూమి నుంచి 1.6 బిలియన్ల మైళ్ల కంటే ఎక్కువ దూరంలో ప్రయాణిస్తున్నఈ స్పేస్ క్రాఫ్ట్ 1977లో లాంచ్ అయింది. గత మార్చి నెలలో అదృశ్యమైన ఈ నౌక..  ఏడు నెలలుగా ఒంటరిగానే అంతరిక్షంలో ప్రయాణిస్తోంది.



ఆస్ట్రేలియాలో గత మార్చి నెలలో శాటిలైట్‌లో రేడియా యాంటినాను రిపేర్ చేస్తుండగా ఈ అంతరిక్ష నౌక నాసాతో కాంటాక్ట్ కోల్పోయింది. అప్పటినుంచి మిషన్ ఆపరేటర్లు నౌక జాడ కోసం అనేక సార్లు కమాండ్స్ పంపించారు. గ్రౌండ్ ఆధారిత డీప్ స్పేస్ స్టేషన్ 43 (DSS43) యాంటినా ద్వారా సిగ్నల్స్ పంపారు. ఇప్పడు ఆ సిగ్నల్ వయోజర్-2‌కు కాల్ అందినట్టు నాసా ధ్రువీకరించింది.



గత మార్చి నుంచి నాసా పలుమార్లు హార్డ్ వేర్లను అప్ గ్రేడ్ చేస్తుండటంతో DSS43 ఆఫ్ లైన్ లోనే ఉండిపోయింది. కానీ, ఇప్పుడు కొత్త కంపోనెంట్లతో వయోజర్-2 అంతరిక్ష నౌకకు కమాండ్లను పంపారు. ఏదిఏమైనా.. కొన్ని బిలియన్ల మైళ్ల దూరంలో ఉన్న వయోజర్-2 స్పేస్ క్రాఫ్ట్ నుంచి రిప్లయ్ రావాలంటే దాదాపు 34 గంటలకు పైగా సమయం పడుతుంది.NASA reestablishes contact

కానీ, వయోజర్-2 కమాండ్స్ అందుకున్న వెంటనే హాలో అంటూ రిప్లయ్ తిరిగి నాసాకు పంపింది. DSS43 ఆస్ట్రేలియాలో ఉంది. ప్రపంచమంతా రేడియో యాంటినాలతో కూడిన సేకరణ భాగం.. చంద్రుని అవతల ఏదైనా అంతరిక్ష నౌకతో సమిష్టిగా కమ్యూనికేట్ అయ్యేందుకు సాయపడుతుంది.



ఆస్ట్రేలియా శాటిలైజ్ డిస్ అనేది DSN (డీప్ స్పేస్ నెట్ వర్క్)లో మూడింటిలో ఒక భాగం.. మిగిలిన రెండింటిలో గోల్డ్ స్టోన్, కాలిఫోర్నియా, మాడ్రిడ్, స్పెయిన్ కూడా ఉన్నాయి. ఫిబ్రవరి 2021 నాటికి DSS43 వ్యవస్థ పూర్తిగా ఆన్ లైన్ లో అందుబాటులోకి రానుంది. 111 అడుగుల వెడల్పు గల భారీ డిష్ 1972 నుంచి పనిచేస్తోంది.