భారత్ బయోటెక్ లో ప్రధాని మోడీ…కరోనా వ్యాక్సిన్ తయారీ, పురోగతిపై సమీక్ష

  • Published By: bheemraj ,Published On : November 28, 2020 / 02:27 PM IST
భారత్ బయోటెక్ లో ప్రధాని మోడీ…కరోనా వ్యాక్సిన్ తయారీ, పురోగతిపై సమీక్ష

PM Modi visit Bharat Biotech : ప్రధాని మోడీ వ్యాక్సిన్‌ టూర్‌ కొనసాగుతోంది. ప్రధాని మోడీ భారత్ బయోటెక్ ను సందర్శించారు. కరోనా వ్యాక్సిన్ తయారీ, పురోగతిపై సమీక్షిస్తున్నారు. కోవాగ్జిన్ పురోగతిపై శాస్త్రవేత్తలతో ప్రధాని మాట్లాడుతున్నారు. హకింపేట్ ఎయిర్‌పోర్టు నుంచి భారత్‌ బయోటెక్‌కు రోడ్డు మార్గంలో ప్రధాని చేరుకున్నారు. వ్యాక్సిన్ అభివృద్ధిపై సమీక్షించారు. కోవాగ్జిన్ పురోగతిపై శాస్త్రవేత్తలు ప్రధానికి వివరించారు.



ప్రభుత్వ- ప్రైవేట్‌ భాగస్వామ్యంలో… ఐసీఎంఆర్‌, భారత్‌ బయోటెక్‌ సంయుక్తంగా కొవాగ్జిన్‌ను అందుబాటులోకి తెస్తోంది. పూణెలోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ అందించిన కరోనావైరస్‌ స్ట్రెయిన్‌తో టీకాను తెస్తోంది భారత్‌ బయోటెక్‌. మధ్యాహ్నం 2గంటల 40నిమిషాలకు హకింపేట్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. దాదాపు గంటపాటు ఎయిర్‌పోర్టులోనే ఉండనున్న ప్రధాని.. మధ్యాహ్నం 3గంటల 50నిమిషాలకు పూణె బయల్దేరుతారు.



ఇక హైదరాబాద్ తర్వాత ప్రధాని పూణేకు వెళ్తారు. అక్కడ సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌లో… ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ- ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌నూ పరిశీలిస్తారు. వ్యాక్సిన్ పనితీరు, వ్యాక్సిన్‌ నిల్వ., రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంపిణీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కంపెనీ ప్రతినిధులు, అధికారులతో చర్చిస్తారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్తారు.



https://10tv.in/wearing-ppe-kit-pm-modi-reviews-covid-vaccine-progress-at-ahmedabads-zydus-cadila/
అంతకు ముందు అహ్మదాబాద్‌లోని జైడస్‌ బయోటెక్‌ పార్కును మోడీ సందర్శించారు. వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియను పరిశీలించారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి, నిల్వ సామర్థ్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు.