Influential Young Indians : ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో 7 మోస్ట్‌ ఇన్‌ఫ్లూన్షియల్‌ యంగ్‌ ఇండియన్స్‌ వీరే

ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో వ్యాపారం, సోషల్, సాంస్కృతిక అభివృద్ధి, వినోదం, క్రీడ వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలకు చోటు లభించింది. ఆసియా జాబితాలో కొంతమంది భారతీయులకు కూడా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది.

Influential Young Indians : ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో 7 మోస్ట్‌ ఇన్‌ఫ్లూన్షియల్‌ యంగ్‌ ఇండియన్స్‌ వీరే

Forbes Influential Young Indians

Forbes 30 Under 30 Asia List : ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో వ్యాపారం, సోషల్, సాంస్కృతిక అభివృద్ధి, వినోదం, క్రీడ వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలకు చోటు లభించింది. ఆసియా జాబితాలో కొంతమంది భారతీయులకు కూడా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది. పారిశ్రామికవేత్తలు చాలా చిన్న వయస్సులోనే ఎందరో అథ్లెట్లు అద్భుతమైన రికార్డులు నెలకొల్పారు. భారతీయ యువ పారిశ్రామికవేత్తల్లో ఏడుగురు అత్యంత ప్రభావంతశీలులు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Harshil Mathur

1. హర్షిల్ మాథుర్ (ఫైనాన్స్) :
ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో హర్షిల్ మాథుర్ చోటు దక్కించుకున్నారు. ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ చెల్లింపులు దైనందిన జీవితంలో ఒక భాగంగా మారాయి. మాథుర్ 2014లో రేజర్‌పేతో ఈ కాన్సెప్ట్ నుప్రవేశపెట్టారు. Razorpay ఇప్పుడు వ్యాపారాల్లో లోన్ సర్వీసుగా పేరొందింది. ఇతర వెంచర్లలో పేరోల్ నిర్వహణలో పాల్గొంది. గత ఏడాది అక్టోబర్‌లో, సింగపూర్‌కు చెందిన జిఐసి, సీక్వోయా ఇండియా సహ-నేతృత్వంలోని సిరీస్ డి ఫండింగ్ రౌండ్‌లో 100 మిలియన్ డాలర్లను సొంతం చేసుకుంది. దాంతో రేజర్‌పే విలువ 1 బిలియన్ డాలర్లకు పైగా ఎగసింది.

Nikita And Nishita Baliarsingh

2-3 నికితా, నిషితా బలియర్సింగ్ (ఇండస్ట్రీ మ్యానిఫ్యాక్చరింగ్, ఎనర్జీ) :
రెండేళ్ల క్రితం, 2019లో ట్విన్ సిస్టర్స్.. నికితా, నిషితా బలైర్సింగ్ ఇండియా ఆధారిత స్టార్టప్‌ను స్థాపించారు. వ్యవసాయ వ్యర్థాల నుండి శక్తిని నిల్వ చేసే కణాలను తయారు చేయడానికి వీరిద్దరూ సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వచ్చారు. ఎండ్ ప్రొడక్టు, ఎలక్ట్రిక్ కార్ల కోసం లిథియం లేని బయోడిగ్రేడబుల్ బ్యాటరీలను తయారు చేయడానికి కూడా ఉపయోగించవచ్చని చెప్పారు. వచ్చే ఏడాది చివరి నాటికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాణిజ్యీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న వీరికి ప్రభుత్వం నుండి రెండు గ్రాంట్లు కూడా వచ్చాయి.

Pranav Vempati

4. ప్రణవ్ వేంపతి (హెల్త్ కేర్ అండ్ సైన్స్) :
మేకర్స్ హైవ్ అనేది 2018లో ప్రణవ్ వెంపతి సహ-స్థాపించిన భారతీయ స్టార్టప్ కంపెనీ. యాంప్యూటీ రోగులకు సరసమైన ప్రొస్తెటిక్ పరికరాలను ఉత్పత్తి చేస్తుంది. మొట్టమొదటి ప్రొడక్టుగా కల్ఆర్మ్ రూపొందించారు. ఇది బయోనిక్ హ్యాండ్. వస్తువులను పట్టుకోవడం, కీబోర్డులలో టైప్ చేయడం వంటి అనేక పనులను చేస్తుంది. వెంపతి సృష్టించిన ప్రొడక్టు.. భారతదేశంలో స్థానికంగా ఉత్పత్తి చేసినందున దాని పోటీదారుల ఉత్పత్తుల ధరలో పదోవంతు మాత్రమే ఖర్చవుతుంది. మేకర్స్ హైవ్ భారతదేశానికి చెందిన పెట్టుబడి సంస్థ స్టార్ ఫిష్ గ్రోత్ పార్టనర్స్ సహా పెట్టుబడిదారుల నుంచి జనవరిలో 9 మిలియన్ డాలర్లను సేకరించింది.

5. శుభం చౌదరి – (సోషల్ ఇంపాక్ట్) :
మనదేశంలో LGBTQ+ కమ్యూనిటీ అంటే.. ఇప్పటికీ అంతగా ఆధరణ లేదు. క్వీర్గా గుర్తించే శుభం చౌదరి ఎల్‌జిబిటిక్యూ+ కమ్యూనిటీకి చెందిన ప్రజలకు సమాన ఆరోగ్య సంరక్షణను అందించడానికి 2019లో సేఫ్ యాక్సెస్‌ను రూపొందించారు. సేఫ్ యాక్సెస్ ఆరోగ్య సంరక్షణ ప్రదాతలకు LGBTQ+ కమ్యూనిటీ అవసరాల గురించి శిక్షణ, విద్యను అందిస్తుంది. దానికి సంబంధించి వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేస్తుంటుంది. రెండు సంవత్సరాలలో, సేఫ్ యాక్సెస్ తన సర్వీసులను 5వేల ఎల్‌జిబిటిక్యూ + కమ్యూనిటీకి అందించింది. మన దేశంలోని 21 నగరాలు, పట్టణాల్లో 100కి పైగా హెల్త్ కేర్ ప్రొవైడర్లను కలిగి ఉంది.

Kamal Singh

6. కమల్ సింగ్, (ఎంటర్‌టైన్మెంట్) :
కమల్ సింగ్, (17) లండన్‌కు చెందిన బ్యాలెట్ అకాడమీ ప్రొఫెషనల్ ట్రైనీ కార్యక్రమానికి ఎంపికైన మొట్టమొదటి భారతీయుడు. ABCD: ఎనీ బాడీ కెన్ డాన్స్ తో సింగిల్ బ్యాలెట్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఢిల్లీలోని ఇంపీరియల్ ఫెర్నాండో బ్యాలెట్ స్కూల్‌లో చేరాడు. రిక్షా డ్రైవర్ కుమారుడు అయిన సింగ్ బ్యాలెట్ పాఠశాల ఫీజును చెల్లించడం కష్టమైంది. బాలీవుడ్ తారలు కునాల్ కపూర్, హృతిక్ రోషన్లతో సహా 300 మంది విరాళంగా ఇచ్చిన క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ ద్వారా సింగ్ విజయవంతంగా, 28వేల డాలర్లు సేకరించాడు.

Vibha Harish

7. విభ హరీష్ – (రిటైల్ & కామర్స్) :
2020 ఆమె స్టార్టప్ కంపెనీకి గొప్ప సంవత్సరమని చెప్పాలి. కాస్మిక్స్, హెర్బల్ న్యూట్రిషన్, ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్ బ్రాండ్ కు అధినేత విభ హరీష్.. ఇప్పుడు భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వెంచర్లలో ఒకటిగా పేరొందింది. గత సంవత్సరంలో హరీష్ కంపెనీ రూ.2 కోట్ల టర్నోవర్ సాధించింది. విభకు యుక్తవయసులో ఆరోగ్య సమస్య వచ్చింది. మహిళల్లో సరైన పోషకాహారం లేకపోవడం ఈ వెంచర్ ప్రారంభానికి దారితీసింది. ‘నేను ఏ అల్లోపతి మందులకు బదులుగా మూలికా తీసుకోవాలని నా తల్లి సూచించింది. నేను మూలికలను వాడటం మొదలుపెట్టాను’ అని చెప్పుకొచ్చింది.