Acer Online Sale Discounts : భారత్‌లో ఇయర్-ఎండ్ సేల్.. ఏసర్ ల్యాప్ టాప్స్‌పై భారీ డిస్కౌంట్!

తైవాన్ కంపెనీ ఏసర్ భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. భారత ఆన్‌లైన్ మార్కెట్లో ఇయర్ ఎండ్ సేల్ ప్రారంభించింది. గేమింగ్‌ ల్యాప్‌ట్యాప్స్‌పై రూ.40 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

Acer Online Sale Discounts : భారత్‌లో ఇయర్-ఎండ్ సేల్.. ఏసర్ ల్యాప్ టాప్స్‌పై భారీ డిస్కౌంట్!

Acer Online Sale Discounts Acer Kicks Off Year End Online Sale In India To Offer Discounts On Gaming Laptops, Accessories

Updated On : December 17, 2021 / 8:27 PM IST

Acer Online Sale Discounts : తైవాన్ కంపెనీ ఏసర్ భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. భారత ఆన్‌లైన్ మార్కెట్లో ఇయర్ ఎండ్ సేల్ ప్రారంభించింది. ఏసర్ అధికారిక వెబ్ సైట్లో డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 17 వరకు ఈ ఇయర్ ఎండ్ సేల్ అందుబాటులో ఉండనుంది. లూట్ అవర్ స్టోర్ సేల్ (Loot Our Store Sale) పేరుతో ఏసర్ తమ ప్రొడక్టులపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆన్ లైన్ సేల్‌లో యాక్ససరీస్, గేమింగ్‌ ల్యాప్‌టాప్స్‌, కంప్యూటర్‌ గాడ్జెట్స్‌ సహా మరెన్నో ప్రొడక్టులపై ఏసర్‌ భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

ప్రత్యేకించి గేమింగ్‌ ల్యాప్‌ట్యాప్స్‌పై రూ.40 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇక గేమింగ్‌ యాక్ససరీస్ పై కూడా 67శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఏసర్‌ ల్యాప్‌ట్యాప్స్‌ ప్రారంభ ధర రూ. 23,990 నుంచి డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. నో-కాస్ట్ EMI, ఉచిత డెలివరీ, బ్రాండ్ వారంటీలతో ఏసర్‌ ఆఫర్ అందిస్తోంది.

అలాగే.. ఏసర్‌ మానిటర్స్‌ రూ. 7,690 నుంచి ఆన్ లైన్ సేల్ లో అందుబాటులో ఉండనున్నాయి. ఏసర్ ఎంపిక చేసిన పలు మోడళ్లపై రెండు ఏళ్ల వారంటీ, ఒక ఏడాది పాటు యాక్సిడెంటర్‌ డ్యామేజ్‌ ప్రొటెక్షన్‌ కూడా ఏసర్ ఆఫర్ చేస్తోంది. Acer Nitro headsets, mice, backpacks, adapters ప్రొడక్టులపై 67 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. అంతేకాదు.. ఎక్సేచేంజ్‌ ఆఫర్లను కూడా ఏసర్‌ ఆఫర్ చేస్తోంది.

ఏసర్‌ ట్యాబ్‌ రూ. 11,999 కొనుగోలుపై రూ.2,999 విలువైన ఏసర్‌ నైట్రో హెడ్‌ఫోన్స్‌ను ఫ్రీగా పొందవచ్చు. ఏసర్ స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. 8 అంగుళాల డిస్ ప్లే, క్వాడ్ కోర్ మీడియా టెక్ MT8766WA SoC, 2GB RAM, 32GB స్టోరేజీ, 4G కనెక్టివిటీ కూడా అందిస్తోంది.

Read Also : SBI Fixed Deposits : ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు.. కొత్త రేట్లు ఇవే!