SBI Fixed Deposits : ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు.. కొత్త రేట్లు ఇవే!

మీకు ఎస్బీఐ బ్యాంకులో ఫిక్సడ్ డిపాజిట్లు ఉన్నాయా? అయితే మీకో గుడ్ న్యూస్.. దేశీయ ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచేసింది.

SBI Fixed Deposits : ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు.. కొత్త రేట్లు ఇవే!

Sbi Increases Interest Rates On Fixed Deposits; Check Revised Rates(2)

SBI Fixed Deposits : మీకు ఎస్బీఐ బ్యాంకులో ఫిక్సడ్ డిపాజిట్లు ఉన్నాయా? అయితే మీకో గుడ్ న్యూస్.. దేశీయ ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచేసింది. ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లపై బేస్ రేటును 0.10 శాతం లేదా 10 బేసిస్ (BPS) పెంచినట్టు వెల్లడించింది. ఎస్బీఐలో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన అకౌంట్ దారులు రూ.2 కోట్లు కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తే వారికి ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని తెలిపింది. అందులోనూ బల్క్ టర్మ్ డిపాజిట్లపై మాత్రమే ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఒక ప్రకటనలో వెల్లడించింది.

రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తంలో ఉండే రిటైల్ టర్మ్ డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్లు పెంపు వర్తించదని ఎస్బీఐ క్లారిటీ ఇచ్చింది. కొత్తగా పెంచిన ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు డిసెంబర్ 15, 2021 నుంచి అమలులోకి వస్తాయని SBI పేర్కొంది. డిసెంబర్ 8న సెంట్రల్ బ్యాంక్ ద్వైమాసిక ద్రవ్య విధాన కమిటీ(MPC) సమావేశాన్ని నిర్వహించింది. సరిగ్గా వారం తర్వాత ఎస్బీఐ సవరించిన కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న రెపో రేటు, రివర్స్ రెపో రేటు వరుసగా 4 శాతం, 3.35 శాతంగా ఉన్నాయి. రెపో రేటును మార్చకుండా అలాగే ఉంచాలని నిర్ణయించినట్టు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. అయితే గత 20 సంవత్సరాలలో ఇదే కనిష్టంగా చెప్పవచ్చు.

కొత్త వడ్డీ రేట్లు ఎంతంటే?

7 రోజుల నుంచి 45 రోజుల వరకు
– పబ్లిక్ కోసం: 2.90 శాతం; సీనియర్ సిటిజన్లకు: 3.40 శాతం

46 రోజుల నుంచి 179 రోజుల వరకు
– పబ్లిక్ కోసం: 3.90 శాతం; సీనియర్ సిటిజన్లకు: 4.40 శాతం

180 రోజుల నుంచి 210 రోజుల వరకు
– పబ్లిక్ కోసం: 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు: 4.90 శాతం

211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ
– పబ్లిక్ కోసం: 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు : 4.90 శాతం

1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ
– పబ్లిక్ కోసం: 5 శాతం; సీనియర్ సిటిజన్లకు: 5.50 శాతం

2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ
– పబ్లిక్ కోసం: 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు: 5.60 శాతం

3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ
– పబ్లిక్ : 5.30 శాతం; సీనియర్ సిటిజన్లకు: 5.80 శాతం

5 సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకు
– పబ్లిక్ : 5.40 శాతం; సీనియర్ సిటిజన్లకు: 6.20 శాతం

Read Also : AP CID : సోషల్ మీడియాలో అలాంటి పోస్టులు పెడితే కేసులే.. ఏపీ సీఐడీ వార్నింగ్