Adani Group Stocks : అయ్యో అదానీ.. భారీ పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్ ఎదురుచూపులు

హిండెన్ బర్గ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్ ను ఇంకా కుదిపేస్తూనే ఉంది. స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు రోజురోజుకు పతనమవుతూనే ఉన్నాయి. దీనికి బ్రేక్ పడాలంటే మార్కెట్ లో విశ్వాసం పెరగాలి. అది జరగాలంటే అదానీ గ్రూప్ లోకి భారీగా పెట్టుబడులు రావాలి. సరిగ్గా ఈ పనిలోనే ఇప్పుడు బిజీగా ఉన్నారు అదానీ గ్రూప్ లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్స్.

Adani Group Stocks : అయ్యో అదానీ.. భారీ పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్ ఎదురుచూపులు

Adani Group Stocks : హిండెన్ బర్గ్ నివేదిక ప్రభావం అదానీ గ్రూప్ ను ఇంకా కుదిపేస్తూనే ఉంది. స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు రోజురోజుకు పతనమవుతూనే ఉన్నాయి. దీనికి బ్రేక్ పడాలంటే మార్కెట్ లో విశ్వాసం పెరగాలి. అది జరగాలంటే అదానీ గ్రూప్ లోకి భారీగా పెట్టుబడులు రావాలి. సరిగ్గా ఈ పనిలోనే ఇప్పుడు బిజీగా ఉన్నారు అదానీ గ్రూప్ లోని సీనియర్ ఎగ్జిక్యూటివ్స్.

విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా అదానీ గ్రూప్ లో అంతా బాగుందనే నమ్మకాన్ని స్టాక్ మార్కెట్ లో కల్పించడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకే అబుదాబికి వెళ్లి అక్కడి ఇన్వెస్టర్లతో ఒప్పందాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి అదానీ గ్రూప్ లో భాగమైన ఐహెచ్ సీ, ఏడీఏఐ.. హిండెన్ బర్గ్ నివేదిక గురించి పట్టించుకోకుండా మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నాయని 15 రోజుల క్రితమే వార్తలొచ్చాయి. అయితే, ఇప్పటికీ ఒప్పందాలు ఖరారు కాలేదు.

Also Read..Gautam Adani Group: హిండెన్‌బర్గ్ దెబ్బకు.. గ్రాంట్ థోర్న్‌టన్‌ను నియమించుకున్న అదానీ గ్రూప్

కాన్ఫరెన్స్ కేపిటల్ గా భావించే ఈ పెట్టుబడుల కోసం ఆ కంపెనీల ప్రతినిధులతో అదానీ గ్రూప్ కి చెందిన ఉన్నత స్థాయి వ్యక్తులు సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. అదానీ ఎంటర్ ప్రైజస్ తో పాటు గ్రూప్ కి చెందిన ఇతర కంపెనీల్లో పెట్టుబడుల కోసం ఇంటర్నేషనల్ హోల్డింగ్ కార్ప్-ఐహెచ్ సీతో మరోసారి చర్చలు జరిపేందుకు కంపెనీ గ్రూప్ ప్రతినిధులు అబుదాబీ వెళ్లారు. రూ.82వేల 659 కోట్ల నుంచి లక్ష 23వేల 928 కోట్ల రూపాయల వరకు పెట్టుబడుల కోసం అదానీ గ్రూప్ ఎదురుచూస్తోంది.

ప్రస్తుతం జరుగుతున్నవి ప్రాథమికమైన చర్చలే అని, ఒప్పందాలకు సంబంధించి విస్తృత చర్చలు ఇంకా జరగాల్సి ఉందని భావిస్తున్నారు. అదానీతో పాటు గ్రూప్ లోని ఇతర ఉన్నత ఉద్యోగులు గతవారం అంతా దీనిపై చర్చలు జరిపారు. అబుదాబీ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీతో పాటు ఇతర సావరిన్ ఫండ్స్ ప్రతినిధులతో సంప్రదింపులు కొనసాగించారు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుతో పాటు సిమెంట్ కంపెనీలు, అదానీ పోర్ట్ సెస్ పై ఏడీఐఏ ఆసక్తితో ఉంది. ఎయిర్ పోర్ట్ హోల్డింగ్ కంపెనీ కోసం గతంలో అదానీ నిధులు సేకరించారు.

Also Read..Adani Group: 500 మిలియన్ డాలర్ల బ్యాంకు రుణాలు చెల్లించనున్న అదానీ

అప్పులు తగ్గించుకునేందుకు కొన్ని షేర్లు బిలియన్ డాలర్లకు పైగా రీ క్లెయిమ్ చేయాలని ప్రమోటర్లు నిర్ణయించుకున్నప్పటికీ మార్కెట్లతో పతనం ఆగడం లేదు. అదానీ ఎంటర్ ప్రైజెస్ ఎఫ్ పీవో విషయంలోనూ అదానీ గ్రూప్ కి ఎదురుదెబ్బే తగిలింది. రీటైల్ ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా ఆసక్తి రాకపోవటంతో అదానీ గ్రూప్ ఇమేజ్ ను కాపాడటం కోసం ఐహెచ్ సీనే (ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ) రంగంలోకి దిగింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రూ.33వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ఐహెచ్ సీ అంగీకరించింది. కానీ, అదానీ ఎంటర్ ప్రైజస్ షేర్ ధర భారీగా పతనం కావడంతో ఈ ఎఫ్ పీవోని వెనక్కి తీసుకుంది అదానీ గ్రూప్. దీంతో ఐహెచ్ సీ ఇన్వెస్ట్ మెంట్ అంతా వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పటికే అదానీ పోర్ట్ అండ్ ఎస్ ఈజెడ్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై రేటింగ్ ను స్టేబుల్ నుంచి నెగిటివ్ కు ఎస్ అండ్ పీ తగ్గించింది.

ఇక గతేడాది సెప్టెంబర్ చివరి నాటికి అదానీ ఎంటర్ ప్రైజస్ అప్పులే 40వేల 23 కోట్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్ లోని 5 పెద్ద కంపెనీల మొత్తం అప్పు 2.1 లక్షల కోట్లకు పెరిగింది. 2019 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. అప్పులు, హిండెన్ బర్గ్ రిపోర్టు ప్రభావంతో విదేశీ ఇన్వెస్టర్లు పెద్దగా అదానీ గ్రూప్ లో పెట్టబడులకు ఆసక్తి చూపడం లేదు.

ఇక, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా బ్యాంకుల నుంచి పెద్దగా అప్పులు పుట్టేలా లేవు. అందుకే, అబుదాబీ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు అదానీ. తనకు గతంలో ఉన్న పరిచయాలతో భారీగా అక్కడి నుంచి ఇన్వెస్ట్ మెంట్లు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఐహెచ్ సీ, ఏడీఐఏలే ఇప్పుడు అదానీ గ్రూప్ ను గట్టెక్కించాలని కోరుతున్నారు. అయితే, ఇంతవరకు ఈ రెండు సంస్థలు ఎలాంటి హామీ ఇవ్వకపోవటం అదానీని టెన్షన్ పెడుతోంది.