బిల్ గేట్స్ నెంబర్ వన్ : జెఫ్ బెజోస్ టైటిల్ చేజారింది

  • Published By: sreehari ,Published On : October 25, 2019 / 09:40 AM IST
బిల్ గేట్స్ నెంబర్ వన్ : జెఫ్ బెజోస్ టైటిల్ చేజారింది

అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుడి టైటిల్ చేజారింది. ప్రపంచ అత్యంత సంపన్నుడిగా మరోసారి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. అమెజాన్ ఇంక్ విడుదల చేసిన రెవిన్యూ, ప్రాఫిట్ క్యూ3 త్రైమాసిక ఫలితాల తర్వాత కంపెనీ సీఈఓ జెఫ్ ర్యాంకు ఒక్కసారిగా అగ్రస్థానం నుంచి కిందికి జారిపోయింది. గురువారం (అక్టోబర్ 24) ఉదయం ప్రారంభంలో ఆన్ లైన్ రిటైల్ ట్రేడింగ్ 7 శాతం మేర తగ్గిపోయింది.

దీని ప్రభావంతో బెజోస్ సంపద ఒక్కసారిగా 103.9 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. దీంతో బిల్ గేట్స్ నికర విలువ 105.7 బిలియన్ డాలర్లతో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నట్టు ఫోర్బ్స్ రిపోర్టు తెలిపింది. బెజోస్ గేట్స్ తర్వాతి రెండో స్థానానికి పడిపోయాడు. 2018లో 160 బిలియన్ల డాలర్ల నికర విలువతో ధనికుడిగా నిలిచిన బెజోస్.. గేట్స్ వెనక్కి నెట్టేశారు. బ్లూబెర్గ్ బిలియనరీస్ సూచికలో ఈ ఏడాది జూలైలో గేట్స్ మూడో ర్యాంకులో నిలిచారు.

2017 నుంచి మూడో త్రైమాసికంలో తొలి ఆదాయంలో నికర లాభం 26శాతానికి పడిపోయినట్టు అమెజాన్ రిపోర్టులో తెలిపినట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. ట్రేడింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే అమెజాన్ 9శాతంగా తగ్గిపోయి ఒక్కో షేర్ కు 1,624డాలర్లతో నిలిచింది. గతంలో బిల్ గేట్స్ 1987 ఫోర్బ్స్ మొట్టమొదటి బిలియనరీ జాబితాలో 1.25బిలియన్ డాలర్ల నికర విలువతో చోటు దక్కించుకున్నారు.

ఆ తర్వాత 1998లో అమెరికా 400 మంది ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో బెజోస్ తొలిసారి చోటు దక్కించుకున్నారు. బెనోజ్ దంపతులు కూడా ఏప్రిల్ నెలలో విడాకులను ఖరారు చేసుకోవడంతో చరిత్రలోనే అతిపెద్ద డివర్స్ సెటిల్ మెంట్ నిలిచింది.