Apple Days Sale : ఆపిల్ ఇయర్ ఎండ్ సేల్.. ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. క్యాష్ బ్యాక్ ఆఫర్లు..

ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లపై ఇయర్ ఎండ్ సేల్ ప్రారంభించింది. ఆపిల్ డేస్ సేల్ పేరుతో ఆపిల్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది.

Apple Days Sale : ఆపిల్ ఇయర్ ఎండ్ సేల్.. ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. క్యాష్ బ్యాక్ ఆఫర్లు..

Apple Days Sale Brings Iphone 13 At Rs 61,900, Cashback Of Up To Rs 10,000 On Macs, And Other Iphones

Apple Days Sale : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లపై ఇయర్ ఎండ్ సేల్ ప్రారంభించింది. ఆపిల్ డేస్ సేల్ (Apple Days Sale) పేరుతో ఆపిల్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తోంది. Apple ప్రొడక్టులపై భారీ తగ్గింపు కోసం విజయ్ సేల్స్‌పై Apple Days సేల్ ఆఫర్ చేస్తోంది. డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ ఆపిల్ డేస్ సేల్ అందుబాటులో ఉండనుంది. విజయ్ సేల్స్ ఆన్ లైన్, ఫిజికల్ స్టోర్లలో తగ్గింపు ధరలతో అందుబాటులో ఉన్నాయి.

విజయ్ సేల్స్ ఐఫోన్‌లతో పాటు Apple Watch Series 7, AirPods 3, AirPods Pro, MacBook, iPad, ఇతర ప్రొడక్టులపై ప్రత్యేకమైన ధరలను అందిస్తోంది. ఐఫోన్‌ల్లో ప్రారంభ ధరల్లో iPhone 13 రూ. 69,900 వరకు తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ ద్వారా మరింత తక్కువ ధరకే ఐఫోన్ 13 సొంతం చేసుకోవచ్చు. Apple Days సేల్ లో భాగంగా iPhone 13 mini రూ. 60,400 కంటే తక్కువ ధరకే పొందవచ్చు. iPhone 13 Pro ప్రారంభ ధర రూ. 1,08,900 నుంచి అందుబాటులో ఉంటుంది. iPhone 13 Pro Max రూ. 1,18,400 నుంచి ప్రారంభం అవుతుంది. ఐఫోన్ 11 మోడల్ ప్రారంభ ధర రూ. 43,400 ఉండగా.. ఐఫోన్ 12 ప్రారంభ ధర రూ. 56,200 నుంచి అందుబాటులో ఉంటాయి. ఇతర ఆపిల్ ఉత్పత్తులపై రూ. 10,000 వరకు HDFC బ్యాంక్ కస్టమర్లకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది.

iPhone 13 ధర రూ.61,900 మాత్రమే :
విజయ్ సేల్స్ ఐఫోన్ 13పై అందిస్తున్న అతిపెద్ద ఆఫర్లలో ఒకటిగా చెప్పవచ్చు. ఆపిల్ డేస్ సేల్స్ సందర్భంగా ఈ ఫోన్ రూ. 61,900కు తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 13 ధర రూ. 79,900గా ఉంటే.. రూ. 75,900 తగ్గింపు ధరకే అందిస్తోంది. దీనికి అదనంగా HDFC బ్యాంక్ కస్టమర్‌లు గరిష్టంగా రూ. 6,000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అసలు ధరతో పోలిస్తే.. రూ. 69,900 తగ్గింపుతో పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా పాత వర్కింగ్ స్మార్ట్‌ఫోన్‌ మార్చుకోవచ్చు. తద్వారా కొత్త ఐఫోన్ కొనుగోలుపై రూ.5 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. మరో రూ. 3,000 తగ్గింపుతో మొత్తం రూ. 18,000 తగ్గింపు పొందవచ్చు.

Apple Days Sale : ఇతర ప్రొడక్టులపై రూ. 10,000 వరకు క్యాష్‌బ్యాక్ :
ఇతర ఐఫోన్‌ మోడల్స్‌పై HDFC క్రెడిట్, డెబిట్ కార్డ్ యూజర్లు రూ.6,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందవచ్చు. ఐఫోన్ 13mini రూ. 6,000 క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. ఐఫోన్ 12, ఐఫోన్ 13pro, Max మోడళ్లపై రూ. 5,000 క్యాష్‌బ్యాక్‌ సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 11పై రూ. 4,000 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు.

iPhones నుంచి iPadల వరకు, iPad 9th Gen రూ. 26,600 ధరకు అందుబాటులో ఉంది. రూ. 3,000 HDFC బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. iPad Air 4th Gen రూ. 46,900 ధరపై రూ. 4,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ అందిస్తోంది. iPad Pro రూ. 63,500 ధరపై రూ. 4వేల వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు.

Macsలో అతిపెద్ద క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులో ఉంది. MacBook Air M1 అత్యల్ప ధరతో రూ. 77,610కి అందుబాటులో ఉంది. HDFC బ్యాంక్ కస్టమర్లు రూ. 6,000 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. MacBook Pro M1 రూ. 7,000 క్యాష్‌బ్యాక్‌తో రూ. 103,610కు పొందవచ్చు. MacBook Pro M1 Pro రూ. 171,200 వద్ద అందుబాటులో ఉంది. దీనిపై రూ. 10,000 భారీ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ అందిస్తోంది. ఆపిల్ వాచ్ సిరీస్ 7 రూ. 3,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో రూ. 36,100కు అందుబాటులో ఉంది. Apple Watch SE రూ. 2,000 క్యాష్‌బ్యాక్‌తో రూ. 25,900 ధర వద్ద అందుబాటులో ఉంది. AirPods Pro రూ. 2,500 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో రూ. 17,990లోపు ధరకు అందుబాటులో ఉంది.

Also Read : RRR New Song : వివాదంలో ‘ఆర్ఆర్ఆర్’ సాంగ్.. కాపీ కొట్టారంటూ నెటిజన్ల ఆగ్రహం