Apple MacBook Pro : సరికొత్త M3 చిప్‌లతో ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో లైనప్ ఇదిగో.. దిమ్మతిరిగే ఫీచర్లు, ఏ మోడల్ ధర ఎంతంటే?
Apple MacBook Pro : ఆపిల్ స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ (Apple Scary Fast Event Today) సందర్భంగా కంపెనీ సరికొత్త M3 ఫ్యామిలీ ప్రాసెసర్‌లతో కొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్ ఆవిష్కరించింది. ఈ మోడల్ ఫీచర్లు, ధర పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Apple ScaryFast event _ MacBook Pro Lineup With M3 Chips
Apple MacBook Pro : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) అక్టోబర్ 31న (ఈరోజు) స్కేరీ ఫాస్ట్ ఈవెంట్ (Apple Scary Fast Event) సందర్భంగా సరికొత్త M3 ఫ్యామిలీ ప్రాసెసర్‌లతో కూడిన సరికొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌లను ఆవిష్కరించింది. ల్యాప్‌టాప్‌లు లిక్విడ్ రెటినా XDR డిస్‌ప్లేలతో ఉంటాయి. 22 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయి. M3, M3 Pro, M3 Max కలిగిన కొత్త చిప్ లైనప్ పర్ఫార్మెన్స్‌తో వచ్చాయని ఆపిల్ చెబుతోంది. ఈ చిప్‌లు (TSMC) 3nm ప్రాసెస్ టెక్నాలజీతో రూపొందాయి. హార్డ్‌వేర్-యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్ డిమాండ్ ఉన్న యాప్‌లు, గేమ్‌లను రన్ చేస్తున్నప్పుడు మెరుగైన GPU పర్ఫార్మెన్స్ కోసం డైనమిక్ కాషింగ్ అనే కొత్త మెమరీ ఫీచర్‌కు సపోర్టును అందిస్తాయి.
భారత్‌లో మ్యాక్‌బుక్ ప్రో (2023) ధర, లభ్యత :
ఆపిల్ కొత్త (M3 MacBook Pro) ధర రూ. 14-అంగుళాల డిస్‌ప్లే, M3 చిప్‌తో కూడిన బేస్ మోడల్‌కు 1,69,900, అయితే M3 ప్రో చిప్‌తో కూడిన 14-అంగుళాల వేరియంట్ ధర రూ. 1,99,900 నుంచి ప్రారంభమవుతుంది. మరోవైపు, 16-అంగుళాల డిస్‌ప్లేతో మాక్‌బుక్ ప్రో బేస్ మోడల్ ప్రారంభ ధర రూ. 2,49,900, మూడు మోడల్స్ సిల్వర్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి. కొత్త M3-పవర్డ్ మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌లు భారత్ సహా 27 దేశాలలో ప్రీఆర్డర్‌కు అందుబాటులో ఉన్నాయి. నవంబర్ 7న ఆపిల్ స్టోర్, ఆపిల్ అధీకృత రీటైలర్ల ద్వారా విక్రయానికి అందుబాటులో ఉన్నాయి.
మ్యాక్‌బుక్ ప్రో (2023) స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
ఆపిల్ అన్ని కొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌లు కంపెనీ కొత్త M3 ఫ్యామిలీ చిప్‌ల ద్వారా ఆధారితమైనవి. అందులో M3, M3 Pro, M3 Max వంటి ల్యాప్‌టాప్స్ ఉన్నాయి. టాప్-ఆఫ్-లైన్ M3 మ్యాక్స్ చిప్‌ను గరిష్టంగా 128GB RAMతో కాన్ఫిగర్ చేయవచ్చు. ఇప్పటివరకు కంపెనీ ల్యాప్‌టాప్‌లలో హై ర్యామ్ కలిగి ఉన్నాయి. M3, M3 ప్రో చిప్‌లతో కూడిన మోడల్‌లను వరుసగా 24GB, 36GB RAMతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఏడాదిలో ఆపిల్ ఆవిష్కరించిన రెండో మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్‌గా చెప్పవచ్చు.

Apple ScaryFast event : MacBook Pro Lineup
కంపెనీ కొత్త M2 పవర్డ్ MacBook Pro మోడల్‌లను గత జనవరిలో లాంచ్ చేసింది. కొత్త చిప్‌లు (TSMC) 3nm ప్రాసెస్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటాయి. 16 వరకు CPU కోర్లు, 40 GPU కోర్లు, 16 వరకు న్యూరల్ ఇంజిన్ కోర్లతో వస్తాయి. ఈ ల్యాప్‌టాప్‌లు గరిష్టంగా 1TB SSD స్టోరేజీతో అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ కొత్త M3 ప్రో చిప్ M1 ప్రో ప్రాసెసర్ కన్నా 40 రెట్లు వేగవంతమైనదని, ఇంటెల్ కోర్ i7 CPU ద్వారా ఆధారితమైన చివరి మ్యాక్‌బుక్ ప్రో మోడల్ కన్నా 11 రెట్లు వేగవంతమైనదని కంపెనీ పేర్కొంది.
లోకల్ మెమెరీతో ఆప్టిమైజ్ చేసుకోవచ్చు :
ఈ కొత్త M3 లైనప్ గత జనరేషన్‌తో పోలిస్తే.. చిన్న సీపీయూ అప్‌గ్రేడ్స్ అందిస్తోంది. ఆపిల్ కొత్త 3nm చిప్‌లలో GPU అప్‌గ్రేడ్స్ ప్రకటించింది. హార్డ్‌వేర్-యాక్సిలరేటెడ్ రే ట్రేసింగ్, M3 చిప్‌లోని GPU అనుమతించే కొత్త డైనమిక్ కాషింగ్ ఫీచర్ అందిస్తోంది. కంపెనీ ప్రకారం.. టాస్క్‌ల కోసం మెమరీ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేసేందుకు లోకల్ మెమరీ కూడా ఉంది. ఆపిల్ కొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌లను 14-అంగుళాలు, 16-అంగుళాల లిక్విడ్ రెటినా XDR (3,024×1,964 పిక్సెల్‌లు) డిస్‌ప్లేలను 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1600 nits (HDR కంటెంట్), 600 గరిష్ట ప్రకాశంతో అమర్చింది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం టచ్ IDకి సపోర్టుతో బ్యాక్‌లిట్ కీబోర్డ్‌ను కలిగి ఉంది.
M3 ప్రో లైనప్.. 22 గంటలు, 18 గంటల బ్యాటరీ లైఫ్ :
కొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌లలో వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, మూడు థండర్‌బోల్ట్ 4/ యూఎస్‌బీ 4 పోర్ట్‌లు, మ్యాగ్‌సేఫ్ 3 ఛార్జింగ్ పోర్ట్, SDXC కార్డ్ రీడర్, HDMI పోర్ట్, 3.5ఎమ్.ఎమ్ హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. M3 చిప్‌తో కూడిన 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ఛార్జ్‌పై గరిష్టంగా 22 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. M3 ప్రో, M3 మ్యాక్స్ మోడల్‌లు 18 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తున్నాయని కంపెనీ చెబుతోంది. M3 Pro, M3 Max చిప్‌లతో కూడిన పెద్ద 16-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌లో గరిష్టంగా 22 గంటల బ్యాటరీ లైఫ్ పొందవచ్చు.