Apple Scary Fast Event : ఆపిల్ స్కేరీఫాస్ట్ ఈవెంట్.. పవర్‌ఫుల్ ఫీచర్లతో అత్యంత ఖరీదైన మ్యాక్‌బుక్ ప్రో ఇదిగో.. భారత్‌లో ధర ఎంతంటే?
Apple ScaryFast Event : ఆపిల్ కొత్తగా ఆవిష్కరించిన హై-ఎండ్ MacBook Pro, M3 చిప్ గరిష్టంగా 128GB RAM కలిగి ఉంది. భారత మార్కెట్లో అత్యంత ఖరీదైన మోడల్‌గా అందుబాటులో ఉంది.

Apple ScaryFast Event _ Most expensive MacBook Pro Price,
Apple Scary Fast Event : ఆపిల్ అభిమానుల కోసం అదిరిపోయే సరికొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టింది. ఆపిల్ స్కేరీఫాస్ట్ ఈవెంట్ (అక్టోబర్ 31) సందర్భంగా M3 చిప్‌లు ఇతర అప్ గ్రేడ్‌లతో కూడిన (MacBook Pro)తో సహా అనేక కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించింది. ఎప్పటిలాగే, ఆపిల్ కొత్త ప్రొడక్టు రిలీజ్ చేసినప్పుడు టాప్-ఆఫ్-లైన్ మోడల్‌పై ఎక్కువ దృష్టిని ఆకర్షించేది. ప్రధానంగా హై ఎండ్ ధర ట్యాగ్‌తో అందిస్తుంది.
అయితే, ఈసారి, ఆపిల్ హై-ఎండ్ M3 మ్యాక్స్ చిప్ 16-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రోలో తనదైన ముద్ర వేసింది. ఆకట్టుకునే 48GB RAM, విశాలమైన 1TB SSD స్టోరేజీని కలిగి ఉంది. ఈ పవర్‌హౌస్ బేస్ మోడల్ భారీ ధర రూ. 3.99 లక్షలతో ప్రారంభమవుతుంది. ఆపిల్ ప్రొడక్టుల్లో వినియోగదారులకు విస్తృతమైన కస్టమైజడ్ ఆప్షన్లను అందిస్తోంది.
ఆపిల్ అందించే (M3 MacBook Pro) అందులో మినహాయింపు కాదని గమనించాలి. మీరు 16-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రోలో స్పెక్స్‌ను అప్‌గ్రేడ్ చేసుకుంటే దాని ధర కూడా పెరుగుతుంది. ఇంకా హై-ప్రాసెసింగ్ పవర్ అవసరమయ్యే యూజర్లు ఈ మోడల్‌ను గరిష్టంగా 128GB RAMతో కాన్ఫిగర్ చేయవచ్చు. అయితే, ఈ అదనపు పర్ఫార్మెన్స్ బూస్ట్ రూ. 1 లక్ష అదనపు ఖర్చుతో వస్తుంది. ఫలితంగా మొత్తం ధర రూ. 4.99 లక్షలకు సొంతం చేసుకోవచ్చు.
అంతటితో ఆగదు. మీరు 8TB SSDతో మీ స్టోరేజీని పెంచుకుంటే.. అదనంగా రూ. 2.2 లక్షలు కేటాయించాల్సి ఉంటుంది. అల్టిమేట్ హై-ఎండ్ 16-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ధరను గణనీయంగా రూ. 7.19 లక్షలకు పెంచుతుంది. ఈ వేరియంట్ భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన, అత్యంత శక్తివంతమైన మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌గా చెప్పవచ్చు.

Apple ScaryFast Event M3 MacBook Pro
ఎడిటింగ్ వర్క్ చేసే వారికి అదనపు ఫీచర్లు :
ఎడిటింగ్ వర్క్ చేసే వారిలో ఫైనల్ కట్ ప్రో (Final Cut Pro), లాజిక్ ప్రో (Logic Pro) వంటి సాఫ్ట్‌వేర్‌లపై ఆధారపడే నిపుణులు, ఔత్సాహికుల కోసం ఆపిల్ ఈ అప్లికేషన్‌లను ప్రీ-ఇన్‌స్టాల్ చేసి అందిస్తుంది. కానీ, అదే ధరతో వస్తాయి. ఫైనల్ కట్ ప్రో ధర రూ. 29,900 కాగా, లాజిక్ ప్రో ధర రూ. 19,900గా ఉంటుంది. మీరు ఈ రెండు పవర్‌ఫుల్ సాఫ్ట్‌వేర్ సూట్‌లను ఎంచుకుంటే.. 16-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో మొత్తం ధర గణనీయంగా రూ. 7.67 లక్షలకు పెరుగుతుంది. పర్ఫార్మెన్స్, సామర్థ్యాలకు ప్రాధాన్యతనిచ్చే వారికి టాప్-టైర్ ఆప్షన్‌గా మారుతుంది.
సరసమైన ధరలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్లు :
అయినప్పటికీ, ఆపిల్ అలాంటి హై-ఎండ్ స్పెసిఫికేషన్‌లు అవసరం లేని సగటు వినియోగదారుని కూడా పరిగణనలోకి తీసుకుంది. అందుకే.. (M3 MacBook Pro) లైనప్‌లో మరిన్ని బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్లు ఉన్నాయి. M3 చిప్‌తో ఆధారితమైన 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో రూ. 1,69,900 నుంచి ప్రారంభమవుతుంది. పర్ఫార్మెన్స్, సరసమైన ధరలకు అందిస్తోంది. M3 ప్రో వేరియంట్, రూ. 1,99,900 ధరతో టాప్-టైర్ ఫీచర్‌ల అదనపు ధర లేకుండా మ్యాక్‌బుక్ కావాలనుకునే వారికి ఆకర్షణీయమైన ఆప్షన్ అందిస్తోంది.

Apple ScaryFast Event M3 MacBook Pro Price
ఆపిల్ లేటెస్ట్ మ్యాక్‌బుక్ ప్రో లైనప్ వైడ్ రేంజ్ యూజర్లను అందిస్తుంది. అద్భుతమై పర్పార్మెన్స్, స్టోరేజీ డిమాండ్ చేసే నిపుణుల నుంచి సరసమైన నమ్మదగిన కంప్యూటింగ్ పరిష్కారాన్ని కోరుకునే రోజువారీ యూజర్ల వరకు ధరల సౌలభ్యం, విభిన్న కాన్ఫిగరేషన్‌లతో అందిస్తోంది. ప్రతి వినియోగదారుకు వారి నిర్దిష్ట అవసరాలు లేదా బడ్జెట్‌తో సంబంధం లేకుండా మ్యాక్‌బుక్ ప్రో ఉండేలా అందిస్తోంది.
ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో M3 చిప్ భారత్ ధర ఎంతంటే? :
మాక్‌బుక్ ప్రో లైనప్ విభిన్న బడ్జెట్‌లలో వివిధ రకాల ఆప్షన్లతో అందిస్తుంది. M3 చిప్‌తో కూడిన 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో రూ. 1,69,900 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 14-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో M3 ప్రోతో రూ. 1,99,900 వద్ద ప్రారంభమవుతుంది. M3 ప్రోతో 16-అంగుళాల పెద్ద మ్యాక్‌బుక్ ప్రోకి వెళితే.. ప్రారంభ ధర రూ. 2,49,900 నుంచి అందుబాటులో ఉంటుంది.
పర్ఫార్మెన్స్, స్టోరేజీ కోరుకునే యూజర్ల కోసం 8TB SSD, 128GB RAMతో కూడిన M3 Maxతో 16-అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ధర రూ.7,19,900తో వస్తుంది. అదేవిధంగా, 14-అంగుళాల మ్యాక్‌బుక్ M3 మ్యాక్స్‌ను అదే స్పెసిఫికేషన్‌లతో కాన్ఫిగర్ చేయడంతో రూ. 6,89,900 సొంతం చేసుకోవచ్చు.