Bank Holidays : ఫిబ్రవరిలో బ్యాంకు సెలవులు ఇవే

ఫిబ్రవరి 01వ తేదీ నుంచి 28వ రోజుల్లో పాటు మొత్తం బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ నెలలో రెండో, నాలుగో శనివారాలు కూడా ఉన్నాయి...

Bank Holidays : ఫిబ్రవరిలో బ్యాంకు సెలవులు ఇవే

Bank Holidays In February 2022 : ప్రతొక్కరికీ బ్యాంకు అకౌంట్ ఉండనే ఉంటుంది. దీని ద్వారా లావాదేవీలు జరుపుతుంటారు. అందరికీ ఉన్నట్లుగానే బ్యాంకులకు కూడా సెలవులుంటాయి. ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. కొంతమంది ఈ సెలవులు గుర్తించకోక పోవడంతో పలు సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఏ నెలలో ఎన్ని రోజులు హాలీడేస్ ఉంటాయో గుర్తుంచుకుంటే.. బ్యాంకులకు సంబంధించిన పనులను ఏ సమస్య లేకుండా చేసుకోవచ్చు. 31వ తేదీతో జనవరి నెల కంప్లీట్ అవుతుంది. ఫిబ్రవరి 01వ తేదీ నుంచి 28వ రోజుల్లో పాటు మొత్తం బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ నెలలో రెండో, నాలుగో శనివారాలు కూడా ఉన్నాయి. వివిధ రాష్ట్రాలకు వేర్వేరు సెలవులు ఉంటాయి. కొన్ని పండుగలు, ఇతరత్ర వాటికి సంబంధించి బ్యాంకుల సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు.

Read More : Brazillian Patients : బ్రెజిల్‌లో విలక్షణమైన కేసులు.. ఆ ముగ్గురికి 70 రోజుల‌కుపైగా క‌రోనా పాజిటివ్‌ వస్తూనే ఉందట!

ఫిబ్రవరి 02వ తేదీ సోనమ్ లోచర్ (గ్యాంగ్ టక్)
ఫిబ్రవరి 5వ తేదీ సరస్వతి పూజ
ఫిబ్రవరి 06వ తేదీ ఆదివారం
ఫిబ్రవరి 12వ తేదీ రెండో శనివారం
ఫిబ్రవరి 13వ తేదీ ఆదివారం

Read More : Extra Marital Affair : వేరే మహిళ కూడా మనతో కలిసుంటుంది…. భర్త ప్రపోజల్.. భార్య ఏం చెప్పిందంటే…

ఫిబ్రవరి 15వ తేదీ మహ్మద్ హజ్రత్ అలీ జన్మదినం (లక్నో, కాన్పూర్, ఇంఫాల్)
ఫిబ్రవరి 16వ తేదీ గురు రవిదాస్ జయంతి (చండీగడ్)
ఫిబ్రవరి 18వ తేదీ డోల్ జాత్రా (కోల్ కతా)
ఫిబ్రవరి 19వ తేదీ ఛత్రపతి శివాజీ జయంతి (బెలాపూర్, ముంబై, నాగ్ పూర్)

Read More : TRS Parliamentary Party : పార్లమెంట్ సెషన్స్, రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని టీఆర్ఎస్ నిర్ణయం

ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం
ఫిబ్రవరి 26వ తేదీ నాలుగో శనివారం
ఫిబ్రవరి 27వ తేదీ ఆదివారం
ఫిబ్రవరి నెలలో ఇన్ని రోజులు హాలీడేస్ ఉన్నా.. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు, ఏటీఎం సేవలు కొనసాగుతాయి.