Best Smartphones : భారత్‌లో రూ. 20వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లివే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. భారత మార్కెట్లో రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Best Smartphones : భారత్‌లో రూ. 20వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లివే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Best smartphones under Rs 20,000 in India_ iQoo Z6, Moto G52 and more

Best Smartphones : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. భారత మార్కెట్లో రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏయే స్మార్ట్ ఫోన్లను ఎంచుకోవాలో అర్థం కావడం లేదా? సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడం చాలా సులభమే. కానీ సరైన డివైజ్ ఎంచుకోవడమే కష్టం.. మీరు రూ. 20,000 లోపు స్మార్ట్ ఫోన్లను కొనేందుకు చూస్తుంటే మాత్రం.. ఈ ధరలో సరైన స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోవచ్చు. కెమెరాలు, బ్యాటరీ, డిస్‌ప్లే వంటి కొన్ని ఫీచర్‌లతో ఐదు స్మార్ట్‌ఫోన్‌లను మీకోసం అందిస్తున్నాం. అందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకోవచ్చు.

OnePlus Nord CE 2 5G :

5G కనెక్టివిటీ సపోర్టుతో ఆల్-రౌండర్ ఫోన్ కావాలంటే.. OnePlus Nord CE 2 5G స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్‌ మరింత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ప్లాస్టిక్‌తో రూపొందించడంతో ఫోన్‌లో ఐకానిక్ స్లైడర్ బటన్ లేదు. OnePlus Nord CE 2 5G కూడా AMOLED స్క్రీన్‌కు బదులుగా LCD స్క్రీన్‌తో వచ్చింది. ఆకర్షణీయమైన రంగులతో అందిస్తుంది. డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. కెమెరాలు అద్భుతం.. మరో ఫీచర్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్ దాదాపు 30 నిమిషాల్లో సున్నా నుంచి 50 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. ఈ ఫోన్ ధర రూ.23,999గా ఉంది. మీరు రిలయన్స్ డిజిటల్‌లో ఈ ఫోన్ రూ. 19,999కి కొనుగోలు చేయొచ్చు.

Best smartphones under Rs 20,000 in India_ iQoo Z6, Moto G52 and more

Best smartphones under Rs 20,000 in India_ iQoo Z6, Moto G52 and more

iQoo Z6 5G :

iQoo Z6 5G స్మార్ట్ ఫోన్.. 5Gకి సపోర్టు ఇస్తుంది. కానీ, వాస్తవానికి, ఈ రెండు 5G బ్యాండ్‌లకు మాత్రమే సపోర్టు ఇస్తుంది. చాలా ఎక్కువ ఖర్చు లేకుండా గేమింగ్, యాప్ బ్రౌజింగ్‌ను అందించగలదు. ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లతో వచ్చింది. 4GB RAM వేరియంట్ ధర రూ.15,499 నుంచి ప్రారంభమవుతుంది. 6GB RAM ఆప్షన్ కొనుగోలు చేయొచ్చు. ఆండ్రాయిడ్ 12 OSతో కూడా వస్తుంది. iQoo Z6 5Gలోని కెమెరాలు ఆసక్తికరంగా ఏమీ లేవు. రోజువారీ ఇన్‌స్టాగ్రామ్ అప్‌లోడ్‌లకు కూడా సరిపోతుంది. గేమింగ్, ఫాస్ట్ ఛార్జింగ్, OK కెమెరాలను కోరుకునే కస్టమర్‌లకు ఫోన్ బెస్ట్ అని చెప్పవచ్చు.

Best smartphones under Rs 20,000 in India_ iQoo Z6, Moto G52 and more

Best smartphones under Rs 20,000 in India_ iQoo Z6, Moto G52 and more

Moto G52 :

Moto G52 సీనియర్ సిటిజన్ కస్టమర్లకు బాగా సరిపోతుంది. భారతీయ యూజర్ల పేరంట్స్‌ను పరిశీలిస్తే.. వారు ఎక్కువగా OTT ప్లాట్‌ఫారమ్‌లు, YouTubeలో కంటెంట్‌ను చూసేందుకు ఈ తరహా ఫోన్లను వినియోగిస్తున్నారు. డి-క్లటర్డ్ ఇంటర్‌ఫేస్ మంచి డిస్‌ప్లేను ఇష్టపడతారు. Moto G52 సూపర్-స్లీక్ బాడీ, పోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. AMOLED డిస్‌ప్లే కంటే వ్యూను అందిస్తుంది. కెమెరాలు బెస్ట్.. మంచి బ్యాటరీ బ్యాకప్‌ కూడా అందిస్తోంది. రూ. 16,499 ధరకు Moto G52 గొప్ప డిస్‌ప్లేతో మంచి కెమెరాలు, బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

Best smartphones under Rs 20,000 in India_ iQoo Z6, Moto G52 and more

Best smartphones under Rs 20,000 in India_ iQoo Z6, Moto G52 and more

Redmi Note 11S :

Redmi Note 11s స్మార్ట్ ఫోన్.. 90Hz రిఫ్రెష్ రేట్‌తో మంచి డిస్‌ప్లేతో అందిస్తుంది. 108-MP ప్రైమరీ కెమెరా-సెంట్రిక్ కస్టమర్లను ఆకర్షిస్తుంది. రియల్ టైం కెమెరాలతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ తీసుకొచ్చింది. Redmi Note 11S ఫోన్ డిస్ప్లే కెమెరాలు కూడా బాగున్నాయి. Motorola ఫోన్‌ వద్దనుకునేవారికి Redmi బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Best smartphones under Rs 20,000 in India_ iQoo Z6, Moto G52 and more

Best smartphones under Rs 20,000 in India_ iQoo Z6, Moto G52 and more

Oppo K10 :

OPPO K10 ఫోన్ లిస్టులో ఇదే అత్యంత సరసమైన ఫోన్.. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్, బ్యాటరీ లైఫ్ పటిష్టంగా ఉంటుంది. ప్రధాన వెనుక, ముందు కెమెరాలు బాగున్నాయి. ఫోటోలు, రంగులు తక్కువగా ఉన్నాయి. ఈ రేంజ్‌లోని ఫోన్ అయినా పర్వాలేదు. బేస్ వేరియంట్ 6GB RAM, 128GB స్టోరేజీతో వస్తుంది. సుమారు రూ. 15వేల వద్ద ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

Best smartphones under Rs 20,000 in India_ iQoo Z6, Moto G52 and more

Best smartphones under Rs 20,000 in India_ iQoo Z6, Moto G52 and more

Read Also :  5 Best Smartwatches : భారత్‌లో రూ. 2వేల లోపు 5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు ఇవే.. వెంటనే కొనేసుకోండి!