Better.com CEO: పెద్ద తప్పే చేశాను.. జూమ్ కాల్‌లో ఉద్యోగులను తొలగించిన సీఈఓ క్షమాపణలు

సీఈవో విశాల్‌ గార్గ్‌.. జూమ్ కాల్‌లో 900మంది ఉద్యోగులను ఒక్కసారిగా తొలగించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

Better.com CEO: పెద్ద తప్పే చేశాను.. జూమ్ కాల్‌లో ఉద్యోగులను తొలగించిన సీఈఓ క్షమాపణలు

Ceo

Better.com CEO: Better.com సీఈవో విశాల్‌ గార్గ్‌.. జూమ్ కాల్‌లో 900మంది ఉద్యోగులను ఒక్కసారిగా తొలగించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కార్పొరేట్ సర్కిళ్లలో పెద్ద చర్చే జరిగింది. విమర్శలు కూడా వ్యక్తం అయ్యాయి. సీఈఓ తీసుకున్న నిర్ణయం తర్వాత సంస్థలోని పలువురు ఉన్నతాధికారులు కూడా రాజీనామాలు చేశారట. ఈ క్రమంలో విశాల్‌ కంపెనీలో ఉద్యోగులను తొలగించిన తీరుకు క్షమాపణలు చెప్పాడు.

జూమ్ కాల్ ద్వారా 900 మందిని తొలగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత తీవ్ర విమర్శలకు గురైన విశాల్ గార్గ్, తొలగింపులకు సంబంధించిన విషయాన్ని చెప్పడంలో ‘పెద్ద తప్పు చేశాను’ అని అన్నారు. జూమ్ కాల్‌లో మొత్త 9శాతం మంది ఉద్యోగులను సీఈఓ తొలగించారు.

ఈ ఘటనపై వివరణ ఇస్తూ.. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులకు విశాల్‌ మెయిల్స్‌ పంపారు. ఉద్యోగులను తప్పించడంలో తప్పుడు విధానం అవలంబించానని.. తన పొరపాటును క్షమించాలని కోరాడు. విశాల్ గార్గ్ ఉద్యోగులను తొలగించిన తీరుతో కార్పొరేట్లు హృదయంలేని వారనే ముద్ర పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

సీఈవో విశాల్‌ గార్గ్‌ ఉద్యోగులను తొలగింపును మాత్రం సమర్ధించుకుంటున్నారు. ఉద్యోగుల సమర్థత, పనితీరు కారణాలతోనే వారిని విధుల నుంచి తప్పించినట్లు విశాల్‌ వెల్లడించారు.

ఏపీలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. ఆ చోరీ తామే చేశామని పోలీసులకు సమాచారం