GST చెల్లింపుదారులకు లాటరీ పథకం!

  • Published By: madhu ,Published On : November 27, 2019 / 11:45 AM IST
GST చెల్లింపుదారులకు లాటరీ పథకం!

పన్ను వసూళ్లు పెంచేందుకు కేంద్రం కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా జీఎస్టీ చెల్లించే వారికి లాటరీ పథకాన్ని తీసుకరావాలని యోచిస్తోందని తెలుస్తోంది. వినియోగదారులను ఆకర్షించడానికి ఈ పథకాన్ని తీసుకరావాలని భావిస్తోంది. 

ఈ కొత్త ప్రతిపాదన జీఎస్టీ మండలి ముందుకు రానున్నట్లు సమాచారం. పన్ను ఎగవేతలను అరికట్టి.. నిఘా పట్టిష్టం చేసేందుకు ఈ పథకం తోడ్పడుతుందని ఆర్థిక మంత్రిత్వా శాఖ భావిస్తోంది. రోజు వారీ, నెలవారీ పద్ధతిలో లాటరీలు తీయాలని, ఏదైనా కొనుగోలు జరిపి..జీఎస్టీ చెల్లించిన వారికి ఈ పథకం వర్తింప చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు టాక్. 
ముందుగా అధికారులస్థాయిలో ఓ అవగాహనకు వచ్చిన తర్వాత జీఎస్టీ కౌన్సిల్ ముందు పెట్టాలని అధికారులు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. బిల్లు విలువ ఎంతుండాలి, బహుమతి ఎంత వస్తుందనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఢిల్లీలో గతంలో ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టారు. 2015 సంవత్సరంలో బిల్ బనావో, ఇనామ్ పావో స్కీంను పోలి ఉండే విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. 
Read More : ఢిల్లీలో ఆక్సిజన్ బార్ : రండి బాబు రండి..గాలి పీల్చుకోండి

> దీనికి కొన్ని పద్ధతులను వినియోగదారులు అవలంబించే విధంగా కార్యాచరణను రూపొందిస్తోంది. 
> లాటరీ పథకం కోసం ప్రత్యేక యాప్ లేదా పోర్టల్‌ను రూపొందిస్తారు. 
> జీఎస్టీతో సహా డబ్బులు చెల్లించిన తర్వాత బిల్లు తీసుకుని ఓ ప్రత్యేక పోర్టల్ లేదా యాప్ ద్వారా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. 
> యాప్ ద్వారా ఫోన్ నెంబర్, వ్యాపారుల జీఎస్టీ సంఖ్య తదితర వివరాలు ఆటోమెటిక్‌గా క్యాప్చర్ చేస్తుంది. 
> విజేతల ఎంపిక ఆన్ ‌లైన్‌లో చేస్తారు. 
> దీని గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.