Gold Rate : బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన గోల్డ్ రేటు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..

Gold Rate : బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన గోల్డ్ రేటు

Gold and silver Price

Gold And Silver Price : కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. శుక్రవారం బంగారం ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారట్ల బంగారంపై రూ. 500 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారంపై రూ.540 తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు భారీగా తగ్గింది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది.

Gold

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,750 వద్దకు చేరుకోగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.71,730 వద్దకు చేరింది.

Gold

  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.65,900 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 71,880.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.65,750 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 71,730.
    చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారంపై రూ. వెయ్యి తగ్గగా.. 24 క్యారట్ల బంగారంపై రూ. 1,090 తగ్గింది. దీంతో అక్కడ.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,150 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.72,160.

Gold

  • స్థిరంగా వెండి ధర ..
    దేశ వ్యాప్తంగా వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది.
    శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.87,000 వద్ద కొనసాగుతుంది.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 87,000.
    కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.83,500
    బెంగళూరులో కిలో వెండి ధర రూ. 82,250

Gold

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.