New Year 2022 GST : కొత్త ఏడాది కొత్త ధరలు..ఇక చెప్పులు, దుస్తులు కాస్ట్లీ

వచ్చే సంవత్సరం వస్తు సేవల పన్నుల్లో మార్పులు చేసుకబోతున్నాయి. సవరించిన రేట్లు 2022, జనవరి 01వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

New Year 2022 GST : కొత్త ఏడాది కొత్త ధరలు..ఇక చెప్పులు, దుస్తులు కాస్ట్లీ

2022

New Year 2022 GST : కొత్త ఏడాది వచ్చేస్తోంది. కొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరంలో కూడా ప్రజలపై ఆర్థిక భారం పడనుంది. ఇప్పటికే పలు వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే సంవత్సరం వస్తు సేవల పన్నుల్లో మార్పులు చేసుకబోతున్నాయి. సవరించిన రేట్లు 2022, జనవరి 01వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. పలు వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ కామర్స్ వేదికగా బుక్ చేసుకొనే ఆటో ఇక భారం కానుంది. ఎందుకంటే…వీటిపై జీఎస్టీ విధించనున్నారు. 2022, జనవరి 01వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఆఫ్ లైన్ లేదా బయట ఉండే ఆటో సేవలకు ఇది వర్తించదు. నేరుగా ఆటోలను పిలుచుకుని ప్రయాణించినా…జీఎస్టీ వర్తించదు.

Read More : Smriti Irani Warn Son in law :‘నాలాంటి అత్తతో జాగ్రత్త’..కాబోయే అల్లుడికి మంత్రి స్మృతి ఇరానీ వార్నింగ్

చెప్పులు, షూస్ :-
పాదరక్షలపై కూడా జీఎస్టీ విధించనున్నారు. 12 శాతం జీఎస్టీ విధించనున్నట్లు ఇటీవలే జీఎస్టీ మండలి ప్రకటించిన సంగతి తెలిసిందే. ధరలతో సంబంధం లేకుండా…అన్ని రకాల ఫుట్ వేర్ పై 12 శాతం జీఎస్టీ విధించనున్నారు. దీంతో చెప్పులు, షూస్ ధరలు వచ్చే సంవత్సరం నుంచి పెరగనున్నాయి.

Read More : Extra Marital Affair : ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

దుస్తులు :-
వస్త్ర పరిశ్రమపై 5 శాతం ఉన్న జీఎస్టీకి మరో 7 శాతం జోడించారు. మొత్తం 12 శాతం విధించనున్నారు. దీంతో అన్ని రకాల వస్త్రాలు, రెడీమెడ్ దుస్తుల ధరలు పెరగనున్నాయి. జనవరి 01వ తేదీ నుంచి MRPతో సంబంధం లేకుండా…అన్ని రకాల రెడీమేడ్ దుస్తులపై 12 శాతం జీఎస్టీ వసూలు చేయనున్నారు.

Read More : Oppo A11s : భారీ బ్యాటరీతో ఒప్పో నుంచి కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్..!

ఫుడ్ యాప్స్ :-
ఫుడ్ డెలివరీ యాప్స్ లో కీలకంగా ఉన్న స్విగ్గీ, జొమాటోలు ఆర్డర్ చేసిన వినియోగదారుల నుంచి 5 శాతం జీఎస్టీ వసూలు చేయనున్నాయి. జనవరి 01వ తేదీ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. స్విగ్గీ, జొమాటో వంటి ఇ-కామర్స్​ సర్వీస్​ ప్రొవైడర్లు..రెస్టారెంట్ సేవలపై జీఎస్టీని సేకరించి..ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రెస్టారెంట్ లు నిర్వహించేవి. జనవరి 01 నుంచి ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ లు నిర్వహిస్తాయి. దీనివల్ల వినియోగదారుడికి ఎలాంటి నష్టం కలుగదని తెలుస్తోంది.