రిలయన్స్ జియోలో 10శాతం వాటా కొనుగోలు చేయనున్న ఫేస్ బుక్!

  • Published By: venkaiahnaidu ,Published On : March 25, 2020 / 10:58 AM IST
రిలయన్స్ జియోలో 10శాతం వాటా కొనుగోలు చేయనున్న ఫేస్ బుక్!

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫేస్ బుక్ తన ఇండియన్ డిజిటల్ మార్కెట్ పరిధిని పెంచుకునేందుకు…ముఖేష్ అంబానీకి చెందిన భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియోలో 10శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఫేస్ బుక్ ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మార్చి-31,2020నాటికి తమ టెలికాసం సర్వీస్ ఆయుధం జియో డెబ్ట్-ఫ్రీ(రుణ విముక్తి)అవ్వాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ టార్గెట్ పెట్టుకున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పటికే 10శాతం డీల్ పై సంతకాలు జరగాల్సి ఉందని,అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ట్రావెల్ బ్యాన్ కొనసాగుతున్నందును చర్చలు ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆగిపోయాయని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ విషయమై రిలయన్స్ ప్రతినిధిని సంప్రదించగా ఆయన దీనిపై కామెంట్ చేసేందుకు నిరాకరించారు. 2016 లో జియో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

వేగంగా ఎదుగుతున్న ఇండియన్ మార్కెట్లో యూఎస్ టెక్ గ్రూప్ లకు పోటీ ఇచ్చే సమార్యం కలిగిన ఒకే ఒక్క కంపెనీగా రిలయన్స్ ఉద్భవించింది. మొబైల్ టెలికామ్స్ నుంచి జియో తన పరిధిని విస్తరించుకుంటూ ముందుకెళ్లింది. హోమ్ బ్రాడ్ బ్యాండ్ నుంచి ఈ కామర్స్ వరకు జియో ఎంట్రీ ఇచ్చింది. జయో విలువ 60బిలియన్ డాలర్లకు పైమాటే అని ఓ విశ్లేషకుడు అన్నారు. అయితే గూగుల్ కూడా రిలియన్స్ జియోతో విడిగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు గూగుల్ కానీ,ఫేస్ బుక్ కానీ జియోతో చర్చల గురించి అధికారికంగా ఎటువంటి కామెంట్ చేసేందుకు ముందుకురాలేదు.

Also Read | కమల్‌నాథ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరైన జర్నలిస్ట్‌కు కరోనా పాజిటివ్