డిజిటల్ పేమెంట్స్ ఈజీ : HDFC నుంచి My Apps అప్లికేషన్

  • Published By: sreehari ,Published On : January 10, 2020 / 09:37 AM IST
డిజిటల్ పేమెంట్స్ ఈజీ : HDFC నుంచి My Apps అప్లికేషన్

డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సహించే దిశగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు సంస్థ HDFC సరికొత్త ప్లాట్ ఫాం myApps లాంచ్ చేసింది. ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ మరింత వేగవంతమయ్యేలా కస్టమైజడ్ ష్యూట్ అప్లికేషన్ తీసుకొచ్చింది. పట్టణ స్థానిక సంస్థలు, హౌజింగ్ సొసైటీలు, లోకల్ క్లబులు, జిమ్ఖానాలు, మతపరమైన సంస్థల కోసం ప్రత్యేకించి ఈ అప్లికేషన్ ప్రవేశపెట్టింది.

ఇందులో బ్యాంకింగ్ ప్రొడక్టులకు సంబంధించి పలు ప్రయోజనాలను అందించనుంది. మొట్టమొదటిసారిగా ఈ myApps ద్వారా తమ ఎకో సిస్టమ్ మొత్తాన్ని ఇతర సంస్థల సాయంతో డిజిటలైజ్ చేస్తోంది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు mySocitey, myClub, myPrayer, myCity మొత్తం నాలుగు రకాల అప్లికేషన్లను ఆఫర్ చేస్తోంది. ఈ యాప్ ద్వారా పలు సంస్థలు తమ బ్రాండింగ్, కంటెంట్ ను ఈజీగా కస్టమైజ్ చేసుకునేలా అనుమతించనున్నట్టు బ్యాంకు ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ సంస్థలన్నీ Google Play Store లేదా Apple AppStoreలో తమ పేరుతో ఒక అప్లికేషన్ పబ్లీష్ చేసుకోవచ్చు. ప్రతి సంస్థలోని అందరి సభ్యులకు ఈ myApps ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీనికి ఎలాంటి నెలవారీ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. దీని ద్వారా సంస్థలోని సభ్యులు నెలవారీ బిల్లులు లేదా ఫీజులు, వివిధ సదుపాయల కోసం ఆన్ లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న యూజర్ల ఫిర్యాదులు, అభ్యర్థనలు, సంస్థలోని సభ్యులు బుకింగ్ చేసుకున్న చెల్లింపులపై రిపోర్టులను ఆయా సంస్థలు ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా బ్రాడ్ క్యాస్ట్ నోటీసులు పంపోచ్చు.

వివిధ కార్యాక్రమాలపై సభ్యులతో చర్చించవచ్చునని బ్యాంకు తెలిపింది. ఇందులో ఎంతమంది యూజర్లు అయినా వినియోగించుకోవచ్చు. ఎలాంటి నిబంధనలు లేవు. ఈ అప్లికేషన్ ద్వారా తాజా ప్రకటనలతో తమ యూజర్లకు అప్ డేట్స్ ఇవ్వొచ్చు. myApps అప్లికేషన్ మొత్తం 20 భాషాల్లో కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రధానంగా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రారంభమవుతుంది.

సాధారణ బ్యాంకింగ్ సర్వీసులను మరింత నాణ్యమైన రీతిలో అందించేలా ఫోకస్ చేస్తూనే.. డిజిటలైజేషన్‌ దిశగా మరో స్థాయికి తీసుకెళ్లడమే బ్యాంకు వ్యూహాంలో ఒక భాగమని ప్రకటనలో తెలిపింది. యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీ దృష్ట్యా.. myApps అప్లికేషన్ నమోదు చేసుకున్న యూజర్ల డేటాను సంబంధిత సంస్థల సర్వర్లలోనే స్టోర్ అయ్యేలా చర్యలు తీసుకున్నట్టు బ్యాంకు పేర్కొంది.