Petrol-Diesel Rates Today : మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఆ రెండు సిటీల్లోనూ సెంచరీ క్రాస్..

దేశంలో ఇందన ధరల మోత మోగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి.. కానీ, దేశంలో మాత్రం ఇందన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

Petrol-Diesel Rates Today : మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. ఆ రెండు సిటీల్లోనూ సెంచరీ క్రాస్..

Petrol Diesel Rates Today

Petrol-Diesel Rates Today : దేశంలో ఇందన ధరల మోత మోగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి.. కానీ, దేశంలో మాత్రం ఇందన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. శుక్రవారం (జూన్ 18) రోజున మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇదివరకే ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరిన ఇందన ధరలు మళ్లీ పెరిగాయి.

తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్ కంపెనీలు మరోసారి పెంచగా… కొత్తగా పెంచిన ధరలతో లీటర్‌ పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 32 పైసలు వరకు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.96.93 ఉండగా.. డీజిల్‌ ధర లీటర్‌కు .87.69కు పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రూ.103 దాటేసింది. ఇక బెంగళూరులో పెట్రోల్ ధర వందకు చేరగా.. డీజిల్‌ రూ.92.97గా ఉంది.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పెట్రోల్‌ రూ.105 మార్క్‌ దాటింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్‌ రూ.108.07 డీజిల్‌ రూ.100.82కు చేరింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు 27 సార్లు ధరలు పెరిగాయి. పెట్రోల్‌పై ధర రూ.6.61, డీజిల్‌ ధర రూ.6.91 పెరిగింది. చెన్నైలో పెట్రోల్‌ రూ.98.14 ఉండగా.. డీజిల్‌ ధర రూ.92.31కు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర లీటర్ కు రూ.96.84 ఉండగా.. డీజిల్‌ ధర రూ.90.54గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.100.74 దాటేయగా.. డీజిల్ ధర లీటర్ రూ.95.59గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ రూ.102.69కు చేరగా.. డీజిల్‌ ధర రూ.96.97గా ఉంది. భోపాల్‌లో పెట్రోల్ రూ.105.13గా ఉండగా.. డీజిల్‌ ధర  రూ.96.35గా ఉంది. రాంచీలో పెట్రోల్‌ ధర రూ.92.91 ఉండగా.. డీజిల్‌ ధర రూ.92.57 పలుకుతోంది. పాట్నాలో పెట్రోల్‌ రూ.99 ఉండగా.. డీజిల్‌ ధర రూ.93.01గా ఉంది.