Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధర

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండడంతో భారత్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.

Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధర

Gold Price Today

Gold Rate: అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండడంతో భారత్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌క‌త్తా న‌గ‌రాల్లో వెండి ధ‌ర స్థిరంగా ఉండగా.. హైదరాబాద్‌లో కాస్త పెరిగింది. 10 గ్రాముల బంగారంపై రూ.10 చొప్పున పెరిగింది. ఇదే సమయంలో కేజీ బంగారంపై రూ. 100 పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి ముందు బంగారం ధరలు పెరిగే అవకాశం ఉండగా.. బంగారంపై ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకునేవారికి ఏడాది మారకముందే కొనుక్కొంటే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,360గా ఉంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,490గా నమోదైంది. కిలో వెండి ధ‌ర రూ. 66వేల 200గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,360గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,490కి చేరుకుంది. కిలో వెండి రూ.66వేల 200 గా ఉంది.

ఢిల్లీలో 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,510గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,810గా ఉంది. వెండి ధ‌ర రూ. 62,300 గా ఉంది. ముంబై, కొల్‌కత్తా బెంగళూరు నగరాల్లో కూడా వెండి ఇదే ధరలో ఉంది.