Gautam Adani : అయ్యో అదానీ.. మరింత దిగజారాడు, ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 10 నుంచి ఔట్

ప్రపంచ కుబేరుల జాబితాలో వేగంగా కిందకు పడిపోతున్నారు గౌతమ్ అదానీ. నిన్న ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 9వ స్థానంలో ఉన్న అదానీ.. ఇవాళ 15వ ప్లేస్ కి పడిపోయారు. హిండెన్ బర్గ్ రిపోర్టుతో అదానీ గ్రూప్ కంపెనీలు నష్టాల బాటపట్టాయి. బిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోతోంది.

Gautam Adani : అయ్యో అదానీ.. మరింత దిగజారాడు, ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 10 నుంచి ఔట్

Gautam Adani : ప్రపంచ కుబేరుల జాబితాలో వేగంగా కిందకు పడిపోతున్నారు గౌతమ్ అదానీ. నిన్న ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 9వ స్థానంలో ఉన్న అదానీ.. ఇవాళ 15వ ప్లేస్ కి పడిపోయారు. హిండెన్ బర్గ్ రిపోర్టుతో అదానీ గ్రూప్ కంపెనీలు నష్టాల బాటపట్టాయి. బిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోతోంది.

ఇవాళ మార్కెట్ ముగిసే సమయానికి 75.1 మిలియన్ డాలర్ల సంపదతో 15వ స్థానానికి పడిపోయారు అదానీ. గౌతమ్ అదానీ గ్రౌండ్ ఫాల్ తో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రిచెస్ట్ ఇండియన్ గా మారారు. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ముకేశ్ అంబానీ 9వ స్థానం దక్కించుకోగా, అదానీ 15వ ప్లేస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇవాళ కూడా అదానీ గ్రూప్ కంపెనీలు నష్టాల బాటలో నిలిచాయి.

Also Read..Adani Group: కొనసాగుతున్న అదానీ గ్రూప్ షేర్ల ఊచకోత

అదానీ గ్రూపు షేర్లు బుధవారం కూడా నష్టపోయాయి. గ్రూపు కంపెనీల షేర్లు నష్టాలతో ట్రేడ్ అయ్యాయి. అదానీ విల్ మార్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్ నష్టాలతో కొనసాగాయి. దీంతో ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో గౌతమ్ అదానీని రిలయన్స్ సామ్రాజ్యాధినేత ముకేశ్ అంబానీ వెనక్కి నెట్టేశారు. దేశీయ అత్యంత సంపన్నుడిగా ముకేశ్ అంబానీ అవతరించారు.

ఇది రియల్ టైమ్ జాబితా. ఏ రోజుకారోజు మారిపోతుంటుంది. అదానీ కంపెనీల షేర్లు గత కొన్ని రోజులుగా హిండెన్ బర్గ్ నివేదిక కారణంగా నష్టపోతుండటం తెలిసిందే. నెల క్రితం గౌతమ్ అదానీ ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలు అదానీ షేర్లపై ప్రభావం చూపాయి. ఫలితంగా అదానీ నికర సంపద విలువ తగ్గిపోయింది. దీంతో బిలియనీర్ల జాబితాలో స్థానాలు తారుమారయ్యాయి.

Also Read..Adani Group: అదానీ గ్రూప్సులో భారీ క్రాష్.. ఒక్కసారిగా కుప్పకూలిన షేర్లు.. అయోమయంలో దలాల్ స్ట్రీట్

ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల తాజా జాబితాలో ముకేశ్ అంబానీ 84.5 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 9వ స్థానంలో ఉన్నారు. బెర్నార్డ్ ఆర్నాల్డ్, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, లారీ ఎల్లిసన్, వారెన్ బఫెట్, బిల్ గేట్స్, కార్లోస్ స్లిమ్, లారీ పేజ్.. అంబానీ, అదానీ కంటే ముందు స్థానాల్లో ఉన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.