CoCa Cola Investment: తెలంగాణలో కోకాకోలా మరో రూ.600 కోట్ల పెట్టుబడి: ప్రభుత్వంతో మూడు ఒప్పందాలు

రూ. 600 కోట్లతో సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ ఫుడ్ ప్రాసెస్సింగ్ పార్క్ వద్ద రెండో ఫ్యాక్టరీ నెలకొల్పుతున్నట్లు HCCB ప్రకటించింది.

CoCa Cola Investment: తెలంగాణలో కోకాకోలా మరో రూ.600 కోట్ల పెట్టుబడి: ప్రభుత్వంతో మూడు ఒప్పందాలు

Coca

CoCa Cola Investment: ప్రముఖ శీతల పానీయాల తయారీ సంస్థ హిందూస్తాన్ కోకాకోలా బేవరేజెస్(HCCB) తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వంతో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్న కోకాకోలా సంస్థ గురువారం కొత్త పెట్టుబడుల ప్రకటన చేసింది. రూ. 600 కోట్లతో సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ ఫుడ్ ప్రాసెస్సింగ్ పార్క్ వద్ద రెండో ఫ్యాక్టరీ నెలకొల్పుతున్నట్లు HCCB ప్రకటించింది. కోకాకోలా కంపెనీ కొత్తగా నెలకొల్పనున్న యూనిట్ కి గానూ తెలంగాణ ప్రభుత్వం 47.53 ఎకరాలు కేటాయించింది. నీరు, ఘన వ్యర్థాల నిర్వహణలో సామర్థ్యాల పెంపు సహా స్థానికంగా ఉపాధి అవకాశాల కల్పనకు, నైపుణ్యాల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వంతో హిందుస్థాన్ కోకా కోలా బేవరేజెస్ దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణలో జరిగిన ఎంఓయూ కార్యక్రమంలో హిందూస్థాన్ కోకా కోలా బేవరేజెస్ చైర్మన్, సీఈవో నీరజ్ గార్గ్, బాట్లింగ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జువాన్ పాబ్లో రోడ్రిగో, తెలంగాణ ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, ఐటీ ఇండస్ట్రీస్ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నారు.

Also read:Uttam Kumar Reddy : కాంగ్రెస్ నేతల అరెస్టులు అప్రజాస్వామికం : ఉత్తమ్ ఆగ్రహం

ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హెచ్‌సిసిబి 25 ఏళ్ల అనంతరం మరో భారీ పెట్టుబడితో రావడం మంచి పరిణామమని..త్వరలోనే రూ.600 కోట్ల పెట్టుబడులు రూ.1000 కోట్లకు చేరాలని ఆకాంక్షించారు. నీరు, ఘన వ్యర్థాల నిర్వహణలో సామర్ధ్యాల పెంపు కోసం పని చేస్తున్న కోకాకోలా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో కూడా అధునాతన పద్దతులను పాటించాలని కేటీఆర్ సూచించారు. కోకాకోలాతో తెలంగాణ పభుత్వం మూడు ఒప్పందాలు కుదుర్చుకుందని..రానున్న రోజుల్లో ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సంస్థకు సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇండియాలో తయారైయ్యే స్థానిక ఉత్పత్తులను ప్రోత్సాహిస్తారని కేటీఆర్ తెలిపారు. జగిత్యాల నుంచి మామిడి, నల్లగొండ, సూర్యాపేట నుంచి స్వీట్ లైమ్ ను కోకాకోలా సేకరించి తమ ఉత్పత్తుల తయారీకి వినియోగిస్తే..ఇక్కడి రైతులకు మేలు చేసినవాళ్ళు అవుతారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Also read:NEET UG 2022 Exam Date : నీట్ పరీక్షల తేదీ ఖరారు.. ఎప్పటినుంచంటే?

సమావేశం సందర్భంగా హెచ్‌సిసిబి చైర్మన్, సీఈవో నీరజ్ గార్గ్ మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా భారత్ లో ఎన్నో మార్పులు వచ్చాయని అన్నారు. భారత్ లో హెచ్‌సిసిబి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 25 లక్షల మొక్కలు నాటబోతున్నామని నీరజ్ గార్గ్ తెలిపారు. తెలంగాణలో రెండో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్న నీరజ్ గార్గ్..తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ దగ్గరలో భూమి కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది చివరికల్లా ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తవుతుందని.. అందులో మహిళా ఉద్యోగులకు పెద్దఎత్తున అవకాశాలు కల్పిస్తున్నట్లు నీరజ్ గార్గ్ వెల్లడించారు.

Also Read:Flight Refuelling: ఎయిర్ ఫోర్స్ అవసరాల నిమిత్తం ప్యాసింజర్ విమానాలను ఇంధన సరఫరా విమానాలుగా మార్చనున్న భారత్