Honda Shine 100 Launch : అత్యంత సరసమైన ధరకే హోండా షైన్ 100.. దిమ్మతిరిగే ఫీచర్లు.. కొంటే ఈ బైకే కొనాలి భయ్యా..!

Honda Shine 100 Launch : కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? హోండా షైన్ 100 కొత్త మోటార్ సైకిల్ వచ్చేసింది. 98.98cc 4-స్ట్రోక్ SI ఇంజిన్‌ను కలిగి ఉంది. గరిష్టంగా 7.38PS శక్తిని, 8.05Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది.

Honda Shine 100 Launch : అత్యంత సరసమైన ధరకే హోండా షైన్ 100.. దిమ్మతిరిగే ఫీచర్లు.. కొంటే ఈ బైకే కొనాలి భయ్యా..!

Honda Shine 100 launched in Rajasthan, price starts

Honda Shine 100 Launch in Rajasthan : ప్రముఖ టూ వీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ (Honda MotorCycle), స్కూటర్ ఇండియా (HMSI) ఎంట్రీ-లెవల్ మోడల్ షైన్ 100 (Honda Shine)ని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రస్తుతానికి ఈ కొత్త హోండా షైన్ 100 బైక్ రాజస్థాన్‌లో రూ. 62,900 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ హోండా షైన్.. హీరో HF డీలక్స్, హీరో స్ప్లెండర్+, బజాజ్ ప్లాటినా 100లకు పోటీగా మార్కెట్లోకి వచ్చింది.

Read Also : Lost Aadhaar Card : మీ ఆధార్ కార్డు కోల్పోయారా? ఆన్‌లైన్‌లో కొత్త ఆధార్ ఎలా పొందాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

ఈ హోండా షైన్ 100 98.98cc 4-స్ట్రోక్ SI ఇంజిన్‌ను కలిగి ఉంది. గరిష్టంగా 7.38PS శక్తిని, 8.05Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇంజిన్ 4-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. హోండా ఎంట్రీ-లెవల్ మోటార్‌సైకిల్ కొత్త తేలికపాటి డైమండ్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక భాగంలో ట్విన్ హైడ్రాలిక్ షాక్‌లను కలిగి ఉంది. 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ముందువైపు 130mm డ్రమ్ బ్రేక్ ఉండగా, వెనుకవైపు 110mm డ్రమ్ బ్రేక్ కూడా ఉంది.

Honda Shine 100 launched in Rajasthan, price starts

Honda Shine 100 Launch in Rajasthan, price starts

ఈక్వలైజర్‌తో కూడిన కాంబి-బ్రేక్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. హోండా షైన్ 100 పొడవు 1,955mm, వెడల్పు 754mm, ఎత్తు 1,050mm, 1,245mm వంటి పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 168 మిమీగా ఉండగా.. కెర్బ్ బరువు 99 కిలోలు ఉంటుంది. మోటార్‌సైకిల్‌లో ఆల్-బ్లాక్ అల్లాయ్‌లు, అల్యూమినియం గ్రాబ్ రైల్, మఫ్లర్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఈ హోండా షైన్ బైక్ బ్లాక్ రెడ్ స్ట్రైప్స్, బ్లాక్ బ్లూ స్ట్రైప్స్, బ్లాక్ గ్రీన్ స్ట్రైప్స్, బ్లాక్ గోల్డ్ స్ట్రైప్స్, బ్లాక్ గ్రే స్ట్రైప్స్ అనే ఐదు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Read Also : Motorola Edge 40 Launch : మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ వచ్చేస్తోంది.. మే 23నే లాంచ్.. కీలక ఫీచర్లు ఇవే..!