Money Invest : 15 ఏళ్లలో రూ.కోటి సొంతం చేసుకోవటం ఎలాగంటే!..

కోటి రూపాయల లక్ష్యంగా పెట్టుకుని మదుపు ప్రారంభించేవారు లక్ష్యాన్ని చేరుకునేందుకు మామూలు ఫ్లాట్ మ్యుచువల్ ఫండ్ సిప్ అంతగా ఉపయోగడదు. ఆ లక్ష్యం నెరవేరాలంటే వార్షిక స్టెప్ అప్ తో కూడిన

Money Invest : 15 ఏళ్లలో రూ.కోటి సొంతం చేసుకోవటం ఎలాగంటే!..

Money

Money Invest :  చాలా మంది భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయాలని ఆలోచిస్తుంటారు. పొదుపు మొత్తాలను తక్కువ సమయంలో ఎక్కవ మొత్తం తిరిగి వచ్చే పధకాలలో పెటుబడులు పెడుతుంటారు. అందరూ చేసేది కూడా ఇదే. అయితే కాస్త కొత్తగా ఆలోచించి కొంచెం స్మార్ట్‌గా పెట్టుబ‌డులు పెడితే అధిక రాబ‌డి సాధించ‌వచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో సిస్ట‌మెటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (సిప్‌) ద్వారా మదుపుచేస్తే కాంపౌండింగ్ ప్ర‌యోజ‌నాల‌తో దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డి పొందేందుకు అస్కారం ఉంటుందనేది చాలామందికి తెలిసిన విష‌య‌మే. అందుకే మ‌దుప‌రులు సిప్ ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో దీర్ఘ‌కాలం పాటు మ‌దుపు చేస్తుంటారు. డబ్బులు మదుపు చేసుకోవాలనుకునేవారు త‌క్కువ స‌మ‌యంలో త‌మ పెట్టుబ‌డి ల‌క్ష్యాన్ని సాధించేందుకు.. వార్షిక ఆదాయం పెరిగిన‌ప్పుడ‌ల్లా సిప్ మొత్తాన్ని పెంచుకుంటే మంచి రాబ‌డిని సాధించేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి.

కోటి రూపాయల లక్ష్యంగా పెట్టుకుని మదుపు ప్రారంభించేవారు లక్ష్యాన్ని చేరుకునేందుకు మామూలు ఫ్లాట్ మ్యుచువల్ ఫండ్ సిప్ అంతగా ఉపయోగడదు. ఆ లక్ష్యం నెరవేరాలంటే వార్షిక స్టెప్ అప్ తో కూడిన ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్ కు వెళ్ళాలి. ఈ ఫండ్లలో రాబడి కనీసం 12శాతం ఉంటుంది. నెలవారీ పెట్టుబడితో సిప్ ను ప్రారంభించే మదుపరులకు ఈ స్టెప్ అప్ విధానం లక్ష్యసాధనకు దోహదపడుతుంది. 10సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడులు కొనసాగిస్తే మధుపరులకు రిస్క్ సామర్ధ్యాన్ని బట్టి 8 నుండి 12శాతం రాబడి పొందే అవకాశం కలుగుతుంది. 40ఏళ్ళ వయస్సు వచ్చే సరికి 1కోటి రూపాయల పొందాలన్న లక్ష్యంతో మదుపు చేసే వారు రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు మంచి ఎంపికగా చెప్పవచ్చు.

25 సంవ‌త్స‌రాల వ‌య‌సులో పెట్టుబ‌డులు ప్రారంభిస్తే.. 40 ఏళ్ల వ‌య‌సుకు 15 సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంటుంది. సాధార‌ణంగా 10 శాతం వార్షిక స్టెప్‌-అప్ ఉంటే మంచిద‌ని నిపుణులు సూచిస్తుంటారు. కానీ ఇక్క‌డ మ‌దుపరి లక్ష్యం పెద్ద‌ది కాబ‌ట్టి వార్షిక స్టెప్‌ అప్ సిప్ క‌నీసం 15 శాతం ఉండాలి. మ్యూచువల్ ఫండ్ సిప్ కాలిక్యులేటర్ ప్రకారం.. ఒక వ్యక్తి తన 25 సంవత్సరాల వయసులో సిప్ చేయ‌డం ప్రారంభిస్తే, 12 శాతం వార్షిక రాబడి అంచనాతో 40 ఏళ్ల వయసుకు అంటే త‌రువాతి 15 సంవత్స‌రాల్లో రూ.1కోటి లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రారంభంలో నెలకు రూ.9,000 పెట్టుబడి పెట్టాలి. అనంతరం 15 శాతం వార్షిక స్టెప్-అప్ రేటు ఉండాలి. ఇలా చేస్తే మదుపు చేసిన మొత్తం రూ.51,38,684, మొత్తం రాబడి రూ.50,96,594, మెచ్యూరిటీ మొత్తం రూ. 1,02,35,278 లభిస్తుంది.