మారటోరియం ఎలా ఎంచుకోవాలి? క్రెడిట్ స్కోర్ ఏమైనా తగ్గుతుందా..?

  • Published By: sreehari ,Published On : October 3, 2020 / 09:00 PM IST
మారటోరియం ఎలా ఎంచుకోవాలి? క్రెడిట్ స్కోర్ ఏమైనా తగ్గుతుందా..?

Credit Score : మారటోరియం వడ్డీ.. వడ్డీపై వడ్డీ సంగతి పక్కనబెడితే.. కేంద్రం మార్చి నెలలోనే ఈ ఆరు నెలలూ కూడా బకాయిలు చెల్లించని కంపెనీలు కానీ వ్యక్తులు కానీ.. డిఫాల్టర్లుగా ప్రకటించవద్దని ఆర్‌బిఐ ద్వారా బ్యాంకులకు సూచించింది.. మరోవైపు సుప్రీంకోర్టులో పిటీషనర్లు కూడా ఈ అంశంపైనే లేవనెత్తారు. కేంద్రం ఈ అంశంపై సెబీకి సర్క్యులర్ పంపినట్లు తెలిపింది.



సెబీతో కలిపి ఈ దిశగాఫాలో అప్ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది. ఇందుకు రెమెడీగా అంటే.. ముందు జాగ్రత్తగా క్రెడిట్ బ్యూరో సంస్థలకు ఆ విషయం తెలియజేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మారటోరియంను ఎంపిక చేసుకోగానే సంబంధిత బ్యాంకులు ఆ విషయాన్ని క్రెడిట్ స్కోర్ అందించే సంస్థలకు తెలియజేస్తాయి.



క్రెడిట్ రిపోర్ట్‌ను వెంటనే చెక్ చేసుకోవాలని సూచిస్తున్నాయి. తేడాలు జరిగితే.. వెంటనే ఆయా సంస్థల దృష్టికి తీసుకెళ్లిన సమయంలో స్కోర్ మైనస్ కాకుండా చూసుకో వచ్చంటున్నారు. బ్యాంకులు కానీ.. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు కానీ వ్యక్తుల అసలు ఆర్ధికస్థితిని కాకుండా.. క్రెడిట్ స్కోరైన సిబిల్ స్కోర్‌ని బట్టే వెంటనే ఇస్తుంటాయి.



ఈ నేపథ్యంలోనే మారటోరియంని వినియోగించుకునేవారికి తమ స్కోరు నెగటివ్ అవుతుందేమో అనే సందేహాలు ప్రారంభం అయ్యాయి. వరసగా ఆరునెలలపాటు చెల్లింపులు లేకపోతే.. సిబిల్ స్కోర్ ప్రతికూలంగా మారుతుందని అంటున్నారు.



అసలు అప్పులు పుట్టకపోతే ఎలా ఆందోళనా వ్యక్తమవుతోంది. ఎందుకంటే మారటోరియం కాలంలో ఇప్పటికే కొంతమంది ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అందుకే మారటోరియం వాడుకోవడంపైనా సుప్రీంకోర్టులో సోమవారం విచారణ సందర్భంగా ఓ స్పష్టమైన సూచనలు గైడ్‌లైన్స్ వచ్చే అవకాశం ఉంది.