Independence Day Offer : కొత్త ఫోన్ కొంటున్నారా? నథింగ్ ఫోన్ (2)పై రూ. 7 వేలు డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!
Independence Day Offer : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఇండిపెండెన్స్ డే సందర్భంగా సేల్ నథింగ్ ఫోన్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్ అందిస్తోంది.

Independence Day Offer _ Nothing Phone 2 can be purchased with up to rs 7,000 discount
Independence Day Offer : ఇండిపెండెన్స్ డే సేల్ సందర్భంగా నథింగ్ ఫోన్ (2)పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ ఏడాది జూలైలో నథింగ్ ఫోన్ (2) రూ. 44,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. నథింగ్ ఫోన్ (2) సేల్ ఆఫర్ సమయంలో మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. నథింగ్ ఫోన్ తగ్గింపులో ICICI, Kotak, HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లకు రూ. 3,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందిస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 41,999కి తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా కస్టమర్‌లు అదనంగా రూ. 4,000 తగ్గింపు పొందవచ్చు.
నథింగ్ ఫోన్ తక్కువ ధర మాత్రమే కాదు.. నథింగ్ ఫోన్ (2) కొనుగోలుపై కొన్ని అప్లియన్సెస్ కూడా డిస్కౌంట్లను పొందవచ్చు. నథింగ్ కేస్‌ను కేవలం రూ. 499కి కొనుగోలు చేయవచ్చు. ఛార్జింగ్ అడాప్టర్ (45W) రూ. 1,999 కి అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ ఆఫర్లు స్టాక్ లభ్యతకు లోబడి ఉంటుందని కంపెనీ ప్రకటనలో పేర్కొంది.
నథింగ్ ఫోన్ (1), ఫోన్ (2) రెండింటినీ కొనుగోలు చేసేవారికి.. నథింగ్ ఇయర్ (స్టిక్) TWS ఇయర్‌ఫోన్‌ల కోసం ప్రత్యేకమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర రూ. 4,250 తగ్గింపు ధరకు అందిస్తుంది. ఇతర వినియోగదారులు కూడా ఈ ఇయర్‌ఫోన్‌లను రూ. 4,999 అనుకూలమైన ధరతో కొనుగోలు చేయొచ్చు. అదనంగా, నథింగ్ ఇయర్ (2) ఆసక్తి ఉన్నవారికి రూ. 8,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.

Independence Day Offer _ Nothing Phone 2 can be purchased
నథింగ్ ఫోన్ (2) ఫీచర్లు :
నథింగ్ ఫోన్ (2) Adreno 730 GPUతో Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్ ద్వారా అందిస్తుంది. ప్రాసెసర్ అప్‌గ్రేడ్‌తో గత జనరేషన్‌తో పోలిస్తే.. నథింగ్ ఫోన్ (2) పర్ఫార్మెన్స్‌లో 80 శాతం బూస్ట్ అందించనుంది. నథింగ్ ఫోన్ (2) 50MP ప్రైమరీ కెమెరాతో సోనీ IMX890 సెన్సార్‌తో f/1.88 ఎపర్చరు, 1/1.56-అంగుళాల సెన్సార్ సైజుతో వస్తుంది. ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS)కి సపోర్టుతో పాటు మోషన్ ఫొటో, సూపర్-రెస్ జూమ్, AI సీన్ డిటెక్షన్, ఎక్స్‌పర్ట్ మోడ్, డాక్యుమెంట్ మోడ్ వంటి అనేక ఇతర ఫీచర్‌లతో వస్తుంది.
నథింగ్ ఫోన్ (2)లోని ప్రైమరీ సెన్సార్ 50 MP f/2.2 Samsung JN1 సెన్సార్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో EISకి సపోర్టు అందిస్తుంది. 114-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూతో వస్తుంది. ముందు వైపున, కొత్త స్మార్ట్‌ఫోన్ f/2.45 ఎపర్చరు, 1/2.74 అంగుళాల సెన్సార్ సైజులో 32MP సోనీ IMX615 సెన్సార్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు 45W PPS ఛార్జింగ్‌తో 4,700 mAh బ్యాటరీ సపోర్టు ఉంది. ఈ ఫోన్‌ను కేవలం 55 నిమిషాల్లో 0 నుంచి 100కి ఛార్జింగ్ అవుతుంది. నథింగ్ ఫోన్ (2) నథింగ్ OS 2.0 కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.