Infosys: ఇంటర్నల్ పరీక్షల్లో ఫెయిల్.. 600 మంది ఫ్రెషర్స్‌ను తొలగించిన ఇన్ఫోసిస్

ఇన్ఫోసిస్ వర్గాల ప్రకారం.. గ్రాడ్యుయేషన్ పూర్తైన చాలా మంది సంస్థలో ట్రైనీలుగా చేరుతారు. వీరికి ఉద్యోగంలో చేరిన తర్వాత సంస్థ శిక్షణ ఇస్తుంది. అనంతరం వీరికి ఇంటర్నల్‌గా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారనే కారణంతో తాజాగా 600 మంది ఫ్రెషర్స్‌ను ఇన్ఫోసిస్ తొలగించింది.

Infosys: ఇంటర్నల్ పరీక్షల్లో ఫెయిల్.. 600 మంది ఫ్రెషర్స్‌ను తొలగించిన ఇన్ఫోసిస్

Infosys: కొత్తగా ఎంపికైన ఉద్యోగులకు భారతీయ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ షాక్ ఇచ్చింది. దాదాపు 600 మంది ఫ్రెషర్స్‌ను ఉద్యోగంలోంచి తొలగించింది. సంస్థ నిర్వహించిన ఇంటర్నల్ టెస్టుల్లో ఫెయిలవ్వడం వల్లే ఉద్యోగుల్ని ఇన్ఫోసిస్ తొలగించినట్లు తెలుస్తోంది. కారణం ఏదైతేనేం.. టెక్ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది.

Ponnam Prabhakar: కేసీఆర్ తీరుతో తెలంగాణకు తీరని అన్యాయం: పొన్నం ప్రభాకర్

తాజాగా ఈ జాబితాలో ఇన్ఫోసిస్ కూడా చేరింది. ఇన్ఫోసిస్ వర్గాల ప్రకారం.. గ్రాడ్యుయేషన్ పూర్తైన చాలా మంది సంస్థలో ట్రైనీలుగా చేరుతారు. వీరికి ఉద్యోగంలో చేరిన తర్వాత సంస్థ శిక్షణ ఇస్తుంది. అనంతరం వీరికి ఇంటర్నల్‌గా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారనే కారణంతో తాజాగా 600 మంది ఫ్రెషర్స్‌ను ఇన్ఫోసిస్ తొలగించింది. వీరిలో 208 మందిని రెండు వారాలక్రితమే తొలగించింది. అయితే, గత ఏడాది జూలైకి ముందు బెంగళూరులో నియమించుకున్న ఫ్రెషర్స్‌ను మాత్రం తొలగించలేదని సమాచారం. ఆ తర్వాత నియామకమైన వారిని మాత్రమే కంపెనీ తొలగించింది.

Valentine’s Day: వాలంటైన్స్ డే బహిష్కరణ.. అమర జవాన్లకు నివాళులు అర్పిద్దామంటూ వీహెచ్‌పీ పిలుపు

ఈ అంశంపై కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ఇంటర్నల్ పరీక్షల్లో ఫెయిలైన వారిని తొలగించడం నిరంతరం జరిగే ప్రక్రియే అని చెప్పారు. ఇన్ఫోసిస్ సంస్థకు ముందు మరో టెక్ సంస్థ విప్రో కూడా ఇలాగే ఉద్యోగుల్ని తొలగించింది. విప్రో సంస్థ కూడా ఇదే పద్ధతిలో ఇటీవల 450 మంది ఫ్రెషర్స్‌ను తొలగించింది. ఇటీవలి కాలంలో టెక్ సంస్థలు తొలగించిన ఉద్యోగుల సంఖ్య లక్షకుపైగానే ఉంటుందని ఒక అంచనా.