‘జియో రైలు’ కొత్త యాప్ : ట్రైన్ బుకింగ్ ఈజీ

ఇప్పటికే కొన్ని సర్వీసుల్లో ఎంట్రీ ఇచ్చిన రియలయన్స్ జియో.. మరో కొత్త సర్వీసుతో మందుకొస్తోంది. అదే.. Jio Rail యాప్. ఇక నుంచి రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలంటే ఈ యాప్..

  • Published By: chvmurthy ,Published On : January 28, 2019 / 10:29 AM IST
‘జియో రైలు’ కొత్త యాప్ : ట్రైన్ బుకింగ్ ఈజీ

ఇప్పటికే కొన్ని సర్వీసుల్లో ఎంట్రీ ఇచ్చిన రియలయన్స్ జియో.. మరో కొత్త సర్వీసుతో మందుకొస్తోంది. అదే.. Jio Rail యాప్. ఇక నుంచి రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలంటే ఈ యాప్..

ఇప్పుడంతా జియో మ‌యం. మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టిన కొద్దికాలంలోనే మార్కెట్ ను రిల‌యన్స్‌ జియో షేక్ చేసింది. క‌స్ట‌మ‌ర్ల‌ను ఎప్పుడిక‌ప్పుడు వ‌రుస ఆఫ‌ర్లుతో ఉక్కిరిబిక్కిరిస్తూ మరోవైపు తోటి పోటీదారుల‌కు కంటిమీద కునుకులేకుండా చేసింది. ఇప్పటికే కొన్ని సర్వీసుల్లో ఎంట్రీ ఇచ్చిన రియలయన్స్ జియో.. మరో కొత్త సర్వీసుతో మందుకొచ్చింది. అదే.. Jio Rail యాప్. ఇక నుంచి రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలంటే ఈ యాప్ నుంచే బుక్ చేసుకోవచ్చు. రైల్వే ప్రయాణికుల కోసం జియో ఈ కొత్త యాప్ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. IRTC రిజర్వడ్ టికెట్ బుకింగ్ సర్వీసుకు జియో రైలు యాప్ ను అనుసంధానం చేసి సర్వీసును అందిస్తోంది. జియో ఫోన్ యూజర్లు తమ ఫోన్ లోని జియో రైలు యాప్ నుంచే ట్రైన్ టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఈ-వ్యాలెట్లతో కూడా ట్రైన్ టికెట్ బుకింగ్ చేసుకోనే వీలుంది.

మీ ట్రైన్ ఎక్కడో ఉందో చెప్పేస్తుంది..
ఒకవేళ బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అంతేకాదు.. ట్రైన్ ఇన్మరేషన్ తో పాటు.. రైలు సమయం, ట్రైన్ రూట్స్, ఎన్నో సీట్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలాగే PNR స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. జియో రైలు యాప్ ట్యాప్ బటన్ పై ఆప్షన్లు కనిపిస్తాయి. ఒరిజినల్ జియో ఫోన్, జియో ఫోన్2 యూజర్లు తమ ఫోన్ లో  ‘జియో రైలు’ యాప్ కావాలంటే.. జియో స్టోర్ నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మీరు ప్రయాణించాల్సిన ట్రైన్ ప్రస్తుతం ఎక్కడ ఉందో కూడా ఈ యాప్ నుంచి లోకేషన్ తెలుసుకోవచ్చు. ప్రయాణ సమయంలో ఫుడ్ ఆర్డర్ చేసే ఆప్షన్ కూడా భవిష్యత్తులో Jio Rail యాప్ అందుబాటులోకి తేనుంది.