Bolero 2022 Model: రెండు ఎయిర్ బ్యాగులతో “బొలెరో 2022” మార్కెట్లోకి విడుదల

తమ ఐకానిక్ ఎస్యూవీ "బొలెరోను"మరింత ఆకర్షణీయంగా, రక్షణాత్మకంగా తీర్చిదిద్ది ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది మహీంద్రా సంస్థ.

Bolero 2022 Model: రెండు ఎయిర్ బ్యాగులతో “బొలెరో 2022” మార్కెట్లోకి విడుదల

Bolero

Bolero 2022 Model: దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా సంస్థ..సరికొత్త మోడల్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తూ మంచి జోరుమీదుంది. గతేడాది ఈ సంస్థ నుంచి వచ్చిన Thar, XUV 700 మోడల్స్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ రెండు వాహనాలపై గరిష్టంగా ఏడాది కాలం వెయిటింగ్ పీరియడ్ నడుస్తున్నట్టు మహీంద్రా సంస్థ డీలర్లు తెలిపారు. మరోవైపు మహీంద్రా సంస్థ 2022 ఏడాదిలో.. మరిన్ని మోడల్స్ ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. అందులో భాగంగా తమ ఐకానిక్ ఎస్యూవీ “బొలెరోను”మరింత ఆకర్షణీయంగా, రక్షణాత్మకంగా తీర్చిదిద్ది ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది మహీంద్రా సంస్థ.

Also Read: Modi Vs TRS: ప్రధాని మోడీ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వనున్న టీఆర్ఎస్ ఎంపీ

ప్రయాణికుల రక్షణ నిమిత్తం “బొలెరో 2022 మోడల్”లో రెండు ఎయిర్ బ్యాగ్ లను పొందుపరిచారు. అన్ని రకాల కార్లలో ఎయిర్ బ్యాగ్స్, ABS తప్పనిసరి చేస్తూ.. జాతీయ మోటారు వాహన చట్టంలో మార్పులు చేసింది కేంద్రం. 2022 జనవరి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రాగా.. ఈమేరకు బొలెరోలో రెండు ఎయిర్ బ్యాగ్ లను జత చేసింది మహీంద్రా సంస్థ. గతేడాది డిసెంబర్ వరకు వచ్చిన బొలెరో వాహనాల్లో డ్రైవర్ వైపున మాత్రమే ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుండగా..ఫిబ్రవరి 2022 నుంచి విడుదలైన బొలెరో మోడల్స్ లో ప్యాసింజర్ వైపునా ఎయిర్ బ్యాగ్ ఉండనుంది. ప్యాసింజర్ వైపు ఎయిర్ బ్యాగ్ ను అమర్చడంతో గతంలో ఉన్న డాష్ బోర్డు హ్యాండిల్ బార్ ను తొలగించారు.

Also read: Anna Hazare: ఫిబ్రవరి 14 నుంచి అన్నా హజారే ఆమరణ నిరాహార దీక్ష

ఇవి మినహా కొత్త బొలెరో వాహనంలో చెప్పుకోదగ్గ మార్పులేవీ లేవని కార్ రివ్యూ సంస్థ “జిగ్ వీల్స్” పేర్కొంది. 1.5-లీటర్, మూడు-సిలిండర్ల mHAWK75 డీజిల్ ఇంజన్ తో వస్తున్న ఈ బొలెరో వాహనం 75 hp@3,600 పవర్ ను 210 Nm@1600-2200 గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్, ఏసీతో వస్తున్న ఈ “బొలెరో 2022” వాహనంలో ABS, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు సీట్‌బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. B4, B6, B6(O) వేరియంట్ లలో లభించే ఈ కారు ధరలు రూ. 8.85 లక్షల – రూ.9.86 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటాయి.

Also read: Statue of Equality: సనాతన ధర్మం మన దేశంలో ఏళ్ల తరబడి సుసంపన్నంగా ఉంది: మోహన్ భగవత్