Anna Hazare: ఫిబ్రవరి 14 నుంచి అన్నా హజారే ఆమరణ నిరాహార దీక్ష

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు వెల్లడించారు.

Anna Hazare: ఫిబ్రవరి 14 నుంచి అన్నా హజారే ఆమరణ నిరాహార దీక్ష

Anna

Anna Hazare: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు. దేశంలో అవినీతిని అంతం చేయాలంటూ గతంలో నిరాహార దీక్షకు దిగిన అన్నా హజారే.. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు వెల్లడించారు. సూపర్ మార్కెట్లలో, జనరల్ స్టోర్లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తామంటూ ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. ఆ పాలసీని వెనక్కు తీసుకోవాలని అన్నా హజారే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయన విజ్ఞప్తిని పట్టించుకోని మహారాష్ట్ర ప్రభుత్వం..మద్యం పాలసీతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది. మద్యం పాలసీని ఉపసంహరించుకోని నేపథ్యంలో తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని మంగళవారం అన్నా హజారే మహారాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. ఈమేరకు సీఎం ఉద్ధవ్ థాక్రేకు అన్నా హజారే లేఖ కూడా రాశారు.

Also read: Statue of Equality: సనాతన ధర్మం మన దేశంలో ఏళ్ల తరబడి సుసంపన్నంగా ఉంది: మోహన్ భగవత్

విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగితే ప్రజలు మత్తుకు బానిసై.. రాష్ట్రం విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని.. ఇది ప్రజలకు, రాష్ట్రానికి మంచిది కాదని అన్నా హజారే తన లేఖలో పేర్కొన్నారు. మద్యం పాలసీపై ప్రభుత్వం వెనక్కు తగ్గాలని.. లేని పక్షంలో ఫిబ్రవరి 14 నుంచి తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు మద్యం దుఖాణాలతో పాటు..సూపర్ మార్కెట్, జనరల్ షాపుల్లోనూ మద్యం అమ్మకాలు సాగించే విధంగా జనవరి 27న మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చింది. దీనిపై బీజేపీ నేతలు, ఇతర ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహారాష్ట్రను “మద్యంరాష్ట్రంగా” మార్చారంటూ సీఎం ఉద్ధవ్ థాక్రేపై మండిపడుతున్నారు.

Also read: Rayachoti District Issue: రాయచోటిని జిల్లా చేస్తేనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి