MG ZS EV Price Cut : ఈ MG ఎలక్ట్రిక్ SUV కారు ధర భారీగా తగ్గిందోచ్.. ఫుల్ ఛార్జ్‌పై 461కి.మీ వరకు దూసుకెళ్తుంది!

MG ZS EV Price Cut : ఎంజీ ZS EV హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, BYD Atto 3 వంటి మార్కెట్లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ SUVలతో పోటీపడుతుంది.

MG ZS EV Price Cut : ఈ MG ఎలక్ట్రిక్ SUV కారు ధర భారీగా తగ్గిందోచ్.. ఫుల్ ఛార్జ్‌పై 461కి.మీ వరకు దూసుకెళ్తుంది!

MG ZS EV Prices Slashed massively, get details here

MG ZS EV Price Cut : ప్రముఖ ఎంజీ (MG Motor India) మోటార్ ఇండియా ప్రసిద్ధ ఎలక్ట్రిక్ SUV, (MG ZS EV) గణనీయమైన ధర తగ్గింపును ప్రకటించింది. రూ. 2.30 లక్షల వరకు ధరలు తగ్గించింది. పర్యావరణ అనుకూల వాహనాన్ని వినియోగదారులకు మరింత అందుబాటులోకి తెచ్చింది.

జనవరి 2020లో లాంచ్ అయినప్పటి నుంచి ఎంజీ ZS ఈవీ మోడల్ కారు 11వేల యూనిట్ల మార్కును దాటి అద్భుతమైన అమ్మకాలను నమోదు చేసింది. MG ZS EV కారు మోడల్ మొత్తం ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్ ప్రో అనే 3 విభిన్న వేరియంట్‌లలో లభిస్తుంది. వేరియంట్ వారీగా MG ZS EV ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.

Read Also : Reliance Jio Prepaid Plans : జియో యూజర్లకు పండుగే.. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లతో ఉచితంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్..!

ఎంజీ ZS EV మోడల్ కారు 176.75PS, 280Nm టార్క్‌ని అందించే శాశ్వత మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌ను ఉపయోగిస్తుంది. ఈ మోటారు 50.3kWh లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఈ కారు మోడల్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌పై 461కి.మీ వరకు దూసుకెళ్తుంది. ఛార్జింగ్ సమయాన్ని బట్టి 7.4kW ఛార్జర్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 9 గంటలు పడుతుంది.

వేరియంట్ల వారీగా ఈవీ కార్ల ధరలు ఇవే :

వేరియంట్ (MG ZS EV) కొత్త ధరలు  పాత ధరలు తేడా ఎంతంటే?
ZS EV Excite రూ. 22.88 లక్షలు రూ. 23.38 లక్షలు రూ. 50,000
ZS EV Exclusive రూ. 25 లక్షలు రూ. 27.30 లక్షలు రూ. 2.30 లక్షలు
ZS EV Exclusive Dual-Tone రూ. 25.10 లక్షలు రూ. 27.40 లక్షలు రూ. 2.30 లక్షలు
ZS EV Exclusive Pro రూ. 25.90 లక్షలు రూ. 27.90 లక్షలు రూ. 2 లక్షలు
ZS EV Exclusive Pro Dual-Tone రూ. 26 లక్షలు రూ. 28 లక్షలు రూ. 2 లక్షలు

8.5 సెకన్లలో 100కి.మీ వేగం :
అయితే 50kW ఛార్జర్ కేవలం ఒక గంటలో 80శాతం ఛార్జ్‌ని పూర్తి చేయగలదు. పర్ఫార్మెన్స్ వారీగా పరిశీలిస్తే.. MG ZS EV 8.5 సెకన్లలో 0 నుంచి 100kmph వరకు స్పీడ్ గా దూసుకెళ్లగలదు. 3 డ్రైవింగ్ మోడ్‌లను కూడా అందిస్తుంది. అందులో ఎకో, నార్మల్, స్పోర్ట్ డ్రైవర్లు, రహదారి పరిస్థితుల ఆధారంగా వారి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కస్టమైజ్ చేసేందుకు అనుమతిస్తుంది.

MG ZS EV Prices Slashed massively, get details here

MG ZS EV Prices 

MG ZS EV SUV ఆకట్టుకునే ఫీచర్లు : 
ఎంజీ ZS ఈవీ శక్తివంతమైనది టాప్-టైర్ ఫీచర్‌లతో కూడా వస్తుంది. ఇందులో పూర్తి-LED హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్‌ల్యాంప్‌లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-అంగుళాల HD టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్‌తో సెఫ్టీ ఫీచర్లు పుష్కలంగా ఉన్నాయి. వాహనం 75కి పైగా కనెక్టివిటీ ఫీచర్‌లను సెగ్మెంట్-ఫస్ట్ డిజిటల్ కీని కలిగి ఉంది. వాహనాన్ని రిమోట్‌గా లాక్ చేసి స్టార్ట్ చేసేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది.

ఇటీవల, MG ZS EV లైనప్‌కి లెవెల్-2 ADAS టెక్నాలజీని అందించింది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందిస్తోంది. MG ZS EV మోడల్ కారు 4 ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అందులో గ్లేజ్ రెడ్, అరోరా సిల్వర్, స్టార్రీ బ్లాక్, కాండీ వైట్ ఉన్నాయి. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్, BYD అటో 3 వంటి మార్కెట్లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ వాహనాలతో పోటీపడుతుంది.

Read Also : Best Smartphones in India : అక్టోబర్ 2023లో రూ. 35వేల లోపు ధరకే 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!